హైటెక్ వ్యభిచారం సిటీ లో  ఉగ్రరూపం దాల్చడం తో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి.. ఇక్కడ పేరుకు క్లినిక్ లోపల జరిగేది మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈమేరకు విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాలు తెలుసుకొని విస్తుపోయారు.. ఓ పార్టీ అధ్యక్షుడు హస్తం ఉండటం గమనార్హం.. అంతే కాకుండా ఇందులో ప్రముఖ డాక్టర్ ఉన్నట్లు సమాచారం..

 

 


వివరాల్లోకి వెళితే...బీహార్‌ల రాజధా ని పాట్నా లోని పిర్బోర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో కొన్నాళ్లుగా గుట్టుగా వ్యభిచారం కొన సాగుతోంది. నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిల ను తీసుకొచ్చి బలవంతం గా వ్యభిచారం చేయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అక్కడి నుంచి తప్పించుకున్న ఓ యువతి పిర్బోర్ పోలీసుల ను ఆశ్రయించడంతో ఈ సెక్స్ దందా వెలుగులో కి వచ్చింది.. 

 

 


ఈ రొంపు లోంచి తప్పించుకొ ని బయట కు వచ్చిన ఓ అమ్మాయి.. అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని పోలీసులుకు వెల్లడించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను తీసుకొచ్చారని, ఓ వ్యక్తి అత్యాచారం చేసి దాన్నంతా వీడియో తీశాడని బాధితురాలు తెలిపింది. ఆ వీడియోను సోషల్‌‌మీడియాలో పోస్ట్ చేస్తామని, మొహంపై యాసిడ్ పోస్టామని బెదిరించి తనతో వ్యభిచారం చేయిస్తున్నారని తెలిపింది.

 


అయితే, బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిన్న ఆ ఇంటిపై దాడి చేశారు. సెక్స్ రాకెట్‌ నిర్వాహకుడితో పాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. తమను బెదిరించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఆ మహిళలు చెప్పడంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు సెక్స్‌వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. కొంతకాలంగా వ్యభిచారాం జోరుగా సాగుతున్న కూడా ఎవరు పట్టించుకోకపోవడం ఏంటి అని పోలీసులు అన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: