లోకంలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదప్పా సిద్దప్పా.. నీ దగ్గర నా దగ్గర డబ్బులు లేవంటే ఎవడైనా నమ్ముతాడు కానీ ప్రపంచ కుబేరుల జాబితాలో పేరు సంపాదించుకున్న వాళ్ల దగ్గర అప్పులు కట్టడానికి డబ్బులు లేవంటే ఎట్టానమ్మేది.. దీనమ్మ జీవితం అబద్దాలు ఆడితే అతికినట్టుండాలా అని మా బామ్మ చెప్పేది.. కానీ అతక్కపోయినా అబద్దాలు ఆడి మాట చెల్లించుకోవాలని చూస్తున్నారు నాయాల్దీ చిరాకు పుట్టుకొస్తుంది, ఇలాంటి మాటలు వింటుంటే..

 

 

ఇంతగా వర్రీ అయ్యేది ఎవరి గురించి అనుకుంటున్నారా.. అదేనండి అనిల్ అంబానీ గురించే.. తీసుకున్న అప్పులు కట్టమంటే నా దగ్గర చిల్లిగవ్వలేదు ఎక్కడినుండి తెచ్చికట్టాలి అంటూ మారాం చేస్తున్నాడట.. అదేంటి వేలకోట్ల రూపాయలను ఏం చేశారని పరేషాన్ అవుతున్నారా.. ఇదే ప్రశ్నను ఓ న్యాయవాది అనిల్ పైకి విసిరాడు.. ఏమయ్యా అనిలు దాదాపు 337 కోట్ల రూపాయల విలాసవంతమైన విహార పడవ, దాదాపు 579 కోట్ల రూపాయల బోయింగ్‌ జెట్‌ ప్రైవేటు విమానంతోపాటు ముంబైలో రెండు బిలియన్‌ డాలర్ల విలాసవంతమైన 27 అంతస్తుల కుటుంబ భవనం కలిగిన మీ చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఏమిటీ?’ అంటూ లండన్‌ హైకోర్టులో మూడు చైనా బ్యాంకుల తరఫున న్యాయవాది అనిల్‌ అంబానీని ఉద్దేశించి వాదించారట విన్నారా కహానీ వినసొపంపుగా ఉందికదూ...

 

 

అయితే చట్టం ఊరుకోదు కదా.. అందుకే మార్చి 20వ తేదీలోగా 80 మిలియన్‌ పౌండ్లు (దాదాపు 772 కోట్ల రూపాయలు) బ్యాంకులకు చెల్లించండి అంటూ అనిల్‌ అంబానీని ఆదేశించారట. ఇకపోతే 2012 వ సంవత్సరంలో చైనాకు చెందిన మూడు ప్రభుత్వ బ్యాంకుల నుంచి 550 మిలియన్‌ పౌండ్లు అంటే దాదాపు 5,310 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారట...

 

 

ఇక ఇలా తీసుకున్న మొత్తంలో కొంత స్టీఫెన్‌ స్పీల్‌బెర్గ్‌ దర్శకత్వం వహించిన ‘లింకన్‌’ హాలీవుడ్‌ చిత్రానికి ఫైనాన్స్‌ చేయగా, అంబానీకి భారీగా డబ్బులు వచ్చినట్లు వార్తలొచ్చాయి.. మరి అంబానీ సారు మాత్రం నా దగ్గర పైసల్ లేవంటున్నాడు.. ఎందుకొచ్చిన తలనొప్పి మీరు మీరు ఏమన్నా చేసుకోండి మాకెందుకు ఈ దురద అనుకుంటున్నారట వీరి గురించి ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు..

మరింత సమాచారం తెలుసుకోండి: