యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ నిజంగా పైన చెప్పిన వారంద‌రికి కీలుబొమ్మేనా ? అంటే అవున‌ని అన‌క త‌ప్ప‌దు. బాల‌య్యను ఎన్టీఆర్ త‌న రాజ‌కీయ వార‌సుడిగా చెప్పారు. ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడు మ‌ద‌న‌ప‌ల్లి బ‌హిరంగ స‌భ‌లో బాల‌య్య‌ను వార‌సుడిగా ప్ర‌క‌టిస్తే ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఎన్టీఆర్‌పై ఒత్తిడి చేసి మ‌రీ బాల‌య్య ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రాడు.. సినిమాలు చేస్తున్నాడ‌ని తిరిగి చెప్పించే వ‌ర‌కు నిద్ర‌పోలేదు. ఇక ఎన్టీఆర్‌ను ప‌ద‌వీ చ్యుతిడిని చేస్తే తెలుగు ప్ర‌జ‌లు అంద‌రూ గ‌గ్గోలు పెట్టినా ఎంతో మంది సినీ అభిమానుల అండ ఉన్న బాల‌య్య కిమ్మ‌న‌లేదు. పైగా తండ్రిదే త‌ప్ప‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాడు.



ఇక బాల‌య్య టీడీపీ ప‌గ్గాలు బాబు చేతి నుంచి లాక్కుంటాడ‌ని అంద‌రూ అనుకుంటున్న టైంలో త‌న కూతురు బ్రాహ్మ‌ణిని లోకేష్‌కు ఇచ్చి ఒకేసారి అటు బాబుకు, అక్క‌ భువ‌నేశ్వ‌రి చేతిలో అటు అల్లుడు లోకేష్ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. ఇక బ్రాహ్మ‌ణిని కోడ‌లిని చేసుకోవ‌డంలో చంద్ర‌బాబు & ఫ్యామిలీ బాల‌య్య నోటికి ప్లాస్ట‌ర్ వేసేసింది. ఇక పార్టీ అధికారంలోకి వ‌చ్చాక బాల‌య్య చివ‌ర‌కు భార్య బ్రాహ్మ‌ణి చేతిలో కూడా కీలుబొమ్మ అయిపోయాడ‌ట‌. త‌న భ‌ర్త లోకేష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ప‌ద‌వి ద‌క్కేలా చేయ‌డంలో బాల‌య్య ద్వారా కూడా ర‌క‌ర‌కాల ఒత్తిళ్లు చేయించింద‌ట‌.



ఓవ‌రాల్‌గా బాల‌య్య అంటే అస్స‌లు ఎవ్వ‌రికి ప‌ట్ట‌డం లేదు. ఆయ‌న అటు నారా, ఇటు నంద‌మూరి ఫ్యామిలీల్లో అంద‌రికి ఓ అలుసు అయిపోయాడు. బాల‌య్య‌ను ఆయ‌న న‌మ్మిన స్నేహితులు సైతం ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఇప్పుడు ఈ క‌ధంతా తెలిసిన ముచ్చ‌టే అయినా ఎందుకు చెప్పుకోవాల్సి వ‌స్తుందంటే... బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మాజీ ఎమ్మెల్యే క‌దిరి బాబూరావు ఈ రోజు టీడీపీకి జెల్ల‌కొట్టేసి వైసీపీలోకి జంప్ చేసేశారు.



ఈ సంద‌ర్భంగా క‌దిరి మాట్లాడుతూ కనిగిరిలో గెలిచినా నన్ను మరో నియోజకవర్గానికి మార్చారు. టికెట్‌ అడిగితే కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఓడినా కనిగిరి ఇంఛార్జ్‌ ఇస్తానని చంద్రబాబు మోసం చేశార‌ని.. తాను ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య‌ను చూసే పార్టీలో ఉన్నాన‌ని.. అయితే  ‘ బాలకృష్ణ చాలా మంచోడు.. ఆయన మాటకూడా అధిష్టానం లెక్కచేయలేదు. నందమూరి, నారా కుటుంబాలకు వ్యత్యాసం ఉంది. జగన్‌పై నమ్మకంతోనే వైసీపీలో చేరాను’ కదిరి బాబూరావు మీడియా ముందు వెల్లడించారు. సో ఓవ‌రాల్‌గా బాల‌య్య అంటేనే ఎలా చీపురు క‌ట్ట మాదిరిగా మారిపోయాడో అర్థం చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: