మార్చి 12వ తేదీ ఒకసారి చరిత్రలోకి చూస్తే... ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి నేడు ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 యశ్వంత రావు  చవాన్ జననం : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ 1913 మార్చి 12వ తేదీన జన్మించారు. 

 

 శ్రీ భాష్యం విజయసారథి జననం  : సంస్కృత భాషా పండితులు ప్రతిభ పరిశోధన విశ్లేషణ వ్యాఖ్యాన రూపంలో దేశవ్యాప్తంగా ఖ్యాతి చెందిన కవి శ్రీభాష్యం విజయసారథి 1956 మార్చ్ 12 వ  తేదీన జన్మించారు. వ్యాఖ్యాన రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి చెందిన కవి ఈయన. ఈయన  ఉన్నతమైన రచనలు రాసి వ్యాఖ్యానముర్తిగా కూడా పేరొందారు. ఆయన ఆంధ్రభాషలో కూడా ఆధునికుడు. శ్రీభాష్యం విజయసారథి తెలంగాణ సంస్కృత వాచస్పతి గా కూడా పేరు ఉంది. వీరి సాహిత్య కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2020 సంవత్సరం పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.  ఈయన ఎన్నో రచనలు రచించి ఎంతగానో ప్రఖ్యాతి పొందారు. మందాకిని,  మహా భారతి,  రాసకేలి, సంగీత మాధవం,  నవీన భారతం,  విషాద లహరి,  ప్రసాద లహరి లాంటి ఎన్నో రచనలను తెలుగు ప్రజలకు అందించారు శ్రీభాష్యం విజయసారథి.

 

 

 ఆలపాటి వెంకట మోహన్ గుప్త జ్ఞానం : ఏవియం గా పేరుగాంచిన వ్యంగ్య  కళాకారుడు అసలు పేరు ఆలపాటి వెంకట మోహన్ గుప్త. 1947 మార్చి 12 వ తేదీన జన్మించారు. ఈయన ఏవిఎం గా తెలుగువారికి సుపరిచితులు. బాపు వడ్డాది పాపయ్య లకు ఏకలవ్య శిష్యుడిగా వినయంగా చెప్పుకున్నారూ ఈయన.  బాపు వ్యంగ్య చిత్రాల వల్ల ప్రేరణ పొంది సినిమా  రంగానికి వచ్చాడు. బొమ్మలు గీయడానికి మద్రాసు డ్రాయింగ్ స్కూల్ లో కష్టపడి నేర్చుకున్నాడు. బాపు వ్యంగ్య చిత్రాల  ద్వారా ఎంతో  ప్రభావితుడైన ఆలపాటి వెంకట మోహన్ గుప్త... వడ్డాది పాపయ్యగారి చిత్రాలను చూసి ప్రేరేపిత అయ్యాడు. ఇక బొమ్మలు గీయడం నేర్చుకోవాలని  నిర్ణయం తీసుకొని మద్రాసులో లైన్ డ్రాయింగ్ హైగ్రేడ్ నేర్చుకుని వచ్చారు. ఇక పిడుగు అన్న కార్టూన్ పాత్రలు పాఠకలోకం మీదకు వదిలాడు ఆలపాటి వెంకట మోహన గుప్త. అనేక సంపుటాలుగా తనే ప్రచురించాడు. ఇతని కార్టూన్ల  సంకలనాలు.. ఔత్సాహిక  వ్యంగ్య చిత్రకారులకు కార్టూన్ అధ్యయనం చేయటానికి ఎంతగానో ఉపకరిస్తాయి. పొందికైన బొమ్మలు వంకరటింకర లేని ఒక ముఖ బంగిమలు,  అవసరానికి మించని  ఇతర వివరాలు సహజత్వానికి దగ్గరగా రంగులు పదునైన సంభాషణలు ఎక్కువగా ఆలపాటి వెంకట మోహన గుర్తు కార్టూన్లలో  కనిపిస్తూ ఉంటాయి. 

 

 అనామిక జననం : భారతీయ సమకాలీన కళాకారిణి తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఈమె 1975 మార్చి 12వ తేదీన జన్మించారు. ప్రముఖ ఆర్టిస్ట్ శ్రీ ఏస్  ధనపాల్ శిష్యురాలు ఈ అనామిక. 

 

 

 శ్రేయ ఘోషల్ జననం : ప్రముఖ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ అయిన శ్రేయ ఘోషల్ 1984 మార్చి 12వ తేదీన జన్మించారు. రాజస్థాన్ కు చెందిన శ్రేయ ఘోషల్ ఇప్పటివరకు తన స్వరంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. కేవలం ఒకే భాషలో కాకుండా... తెలుగు,  కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళ్,బెంగాలీ,  హిందీ ఇలా ఎన్నో భాషల్లో పాటలు పాడి వినిపించారు శ్రేయ ఘోషల్ . శ్రేయ ఘోషల్ స్వరం తో ఒక పాట విన్నాము  అంటే మైమరిచి పోవాల్సిందే. కోయిలమ్మ పాట పాడినట్టుగా శ్రేయ ఘోషల్ పాట ఉంటుంది. ఏ పాట పాడిన ఆ పాటకు తగ్గట్టుగా తన స్వరాన్ని  మార్చుకొని పాడగలదు. శ్రేయ ఘోషల్ తెలుగు తో పాటు అన్ని ఇండస్ట్రీల్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు . ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో వందల పాటలు పాడింది శ్రేయ  ఘోషల్ . శ్రేయ ఘోషల్ ఏదైనా పాట పాడింది అంటే అది ఖచ్చితంగా అభిమానుల్లో కి వెళుతుంది అని అందరి నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి: