జగన్ అదిరిపోయే స్కెచ్ తో రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకి చెమటలు పట్టిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఊహించని దెబ్బ కొట్టిన జగన్ ఆ తర్వాత తన నిర్ణయాలతో దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన ఊపిరి లో ఉంది అని చెప్పవచ్చు. రాజకీయంగా మూడు రాజధానుల నిర్ణయం విషయంలో చంద్రబాబు అమరావతి ప్రాంతానికే పరిమితం కావడం జరిగింది. మిగతా ప్రాంతాలలో దోషిగా తేలిపోయారు. ఇటువంటి తరుణంలో తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జగన్ వేసిన బీసీల స్కెచ్ తో దాదాపు 80 శాతం సీట్లు జగన్ జేబులోకి వెళ్లిపోయినట్లు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకుంటే దానిని వ్యతిరేకించడంతో పాటు అమరావతి కి జై కొట్టడం తో చంద్రబాబు 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో ఒకపక్క అభివృద్ధి మరోపక్క బీసీ రిజర్వేషన్ ఫార్ములాతో వైయస్ జగన్ పార్టీకి అద్భుతమైన రెస్పాన్స్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది అని అంటున్నారు చాలామంది.

 

అంతేకాకుండా సంక్షేమం కూడా సరైన రీతిలో అందుతున్న తరుణంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ భీభత్సమైన మెజార్టీ సాధించడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. మరోపక్క రాష్ట్రంలో కొన్ని సామాజిక వర్గాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నాగాని..ఆ వ్యతిరేకత ఓటు బిజెపి మరియు జనసేన పార్టీ కలిసి పోటీ చేయడం తో అది పెద్దగా ప్రభావం చూపదని అంటున్నారు. మొత్తంమీద ఎటుచూసినా జగన్ కి ప్రస్తుతం రాష్ట్రంలో మంచి టైం నడుస్తుంది...స్థానిక ఎన్నికలలో 80 శాతం సీట్లు జగన్ పార్టీ గెలవటం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: