ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పేద విద్యార్థులు అందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా నడుంబిగించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ . ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో  ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందించే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది . ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మధ్యాహ్న భోజనంలో కూడా పౌష్టిక ఆహారాన్ని  అందిస్తుంది జగన్ సర్కార్.

 

 

 అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టింది. ఇక తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను బడికి పంపేందుకు అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఏటా 15 వేల రూపాయల అందిస్తోంది. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది  జగన్ సర్కార్. వాన కాలంలో స్కూలు తెరిచి నాటికి అన్ని స్కూళ్లకు జగనన్న విద్యా దీవెన సామాగ్రి  పంపిణీ చేయాలని నిర్ణయించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో జగనన్న విద్యా దీవెన పథకం పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన పథకం కి సంబంధించి పలు నమూనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చూపించారు అధికారులు . 

 

 

 జగనన్న విద్య దీవెన పథకంలో భాగంగా పేద విద్యార్థులకు అందించే కిట్ లో  మూడు జతల యూనిఫామ్స్ తో పాటు, బూట్లు సాక్సులు,  బెల్టు,  నోట్ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. అంతే కాకుండా విద్యార్థులకు పంపిణీ చేసే వస్తువులు అన్నిటిలోనూ నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం విద్య పైన కూడా సమీక్షించారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు పెద్దపీట వేయాలని జగన్ సూచించగా... దానికోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు స్మార్ట్ టీవీ అందించాలని అధికారులు జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఇక సీఎం గోరుముద్ద కు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్లో ఉండకూడదని ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని... తొలి విడతలో భాగంగా 15715 పాఠశాలల్లో అన్ని పనులు పూర్తి కావాలంటూ  స్పష్టం చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: