స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా కడదాక నీడలాగా నిను వీడి పోదురా నీ గుండెలో పూచేటిది..నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా....అని పాడుకునే రోజులు పోయాయి.. స్నేహం ముసుగులో నక్కలు, తోడేళ్లు కాపుకాస్తున్నాయి.. మోసం చేసేవాడు స్నేహితుడైతే త్వరగా మోసపోయేవాడు స్నేహితుడే.. ఇలా అందరుండరని అనుకుంటాము కానీ నూటికి 99 శాతం లోకంలో ఇలాగే జరుగుతుంది.. స్వచ్చమైన స్నేహానికి ఎప్పుడో కాలం చెల్లింది..

 

 

ఇకపోతే మూడు రోజుల క్రితం కిడ్నాపైన లేబర్ ఆఫీసర్ ఆనంద్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించి ఆయన మృతదేహాన్ని భూపాలపల్లిలోని రాంపూర్ అడవుల్లో స్వాధీనం చేసుకున్నారు. కాగా మార్చి ఏడో తేదీన ఆనంద్ రెడ్డి, తన స్నేహితుడు ప్రదీప్‌రెడ్డితో కలిసి బయటకు వెళ్లడమే గానీ తిరిగి ఇంటికి చేరలేదు.. తొలుత ఆయన ఆఫీసు పని మీద బయటకు వెళ్లి ఉంటారని భావించిన కుటుంబ సభ్యులు, రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఆచూకి కనుగొని, భూపాలపల్లి అడవుల్లో ఆయన సిగ్నల్స్ ఆగిపోయినట్టు గుర్తించారు.

 

 

దీంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసులు ఆనంద్ మృతదేహాన్ని కనుగొన్నారు.. ఇకపోతే ఆనంద్ రెడ్డిని అతడి స్నేహితుడు, సీఐ సోదరుడైన ప్రదీప్ రెడ్డి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని సమాచారం. కాగా ఈ హత్య వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందని, టీఆర్ఎస్ నేత సోదరుడి ప్రమేయం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించిన కారును హైదరాబాద్‌లో గుర్తించి, కూపీలాగగా, ఈ కారును అల్వాల్‌లో వాటర్ వాష్ చేయించి, ప్రదీప్ రెడ్ది తన స్నేహితుడి ఇంటి దగ్గర పార్కింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే కమలాపూర్‌కు చెందిన ఇసుక వ్యాపారిపై, మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. మరి పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే గాని నమ్మలేని నిజాలు ఎన్ని బయటకు వస్తాయో తెలీదంటున్నారు కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: