మా కంపెనీకి జీతాలు పెరిగినాయ్ అని ఒకప్పుడు ఆనందంగా పాడుకునే వారు.. కాని నేటి పరిస్దితుల్లో మా రాష్ట్రానికి అప్పులు పెరిగినాయ్ అని దిగాలు పడవలసిన రోజులు ఏర్పడ్డాయి.. ఇప్పటికే నిరుద్యోగులకు నిధులు లేక నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోతున్నామని ప్రకటించిన తెలంగాణ సర్కార్.. తాజాగా కార్పొరేషన్‌‌పై ఉన్న ఆర్థిక భారాన్ని తొలగించుకోవడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది.. అదేమంటే రాజీవ్‌ స్వగృహ ఆస్తులు అమ్మాలని డిసైడ్ అయ్యింది..

 

 

ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే కార్యదర్శులతో కూడిన ఈ కమిటీ నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లు, ఇతర ఆస్తులపై విధివిధానాలు ఖరారు చేయనుందట.. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు ఉన్న గత ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలు కొరకు రాజీవ్‌ స్వగృహ ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇందుకోసం కార్పొరేషన్‌‌ను ఏర్పాటు చేసి, రంగారెడ్డి జిల్లా పరిధిలోని బండ్లగూడ, పోచారంలో ప్లాట్ల నిర్మాణం చేపట్టింది.

 

 

అయితే కొన్నేళ్ల తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు తల్లెత్తడంతో, ఈ నిర్మాణాలు అనాధల్లా మిగిలిపోయాయి.. ఈ నేపథ్యంలో ఆ ప్లాట్లను యథాతథంగా విక్రయించి, కొంత నిధులను సేకరించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది... ఇక ప్రభుత్వానికి కావల్సిన నిధులు సమకూరాలంటే రాజీవ్‌ స్వగృహ ఆస్తులను విక్రయించడం ఒకటే మార్గంగా భావించిన  రాష్ట్ర ప్రభుత్వం, చిత్రా రామచంద్రన్‌ అధ్యక్షతన ఓ కమిటిని ఏర్పాటు చేసింది.. ఇక ఈ కమిటీలో ఆర్థిక, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్‌ కుమార్‌ సభ్యులుగా ఉన్నారు. కాగా వీరితోనే ఆ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ముగియనున్నాయని తెలుస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: