రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఎన్నో ప్రాణాలు గాలిలోనే కలిసిపోతున్నాయి. అంత సేపు అందరితో సంతోషంగా గడిపిన వారు ఒక్క నిమిషంలోనే కానరాని లోకాలకు వెళ్తున్నారు. రోజుకు ఎదో ఒక్క ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరి కొంత మంది వారి అవయవాలను కోల్పోయి నరక ప్రాయంగా వారి జీవనం కొనసాగిస్తున్నారు. అతి వేగంతో హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.

 

అతి వేగంతో బస్సు అదుపు తప్పి బైక్‌ ను వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ పై వెళ్తున్న డెలివరీ బాయ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. జహీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్తుండగా మియాపూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన నూనావత్ మిత్యా, మోతి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సుమన్ నాయక్ (25). తొమ్మిది నెలల క్రితమే లక్ష్మి అనే యువతితో సుమన్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సుమన్.. మియాపూర్‌ లో ఉంటూ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

 

ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడి బైక్‌ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ తలకు బలమైన గాయం కావడంతో అతడు చనిపోయాడు. సుమన్ మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

డ్రైవర్లు వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోని రోడ్డు నియమాలు పాటించాలన్నారు. వాహనాలపై వెళ్ళటప్పుడు హెల్మెంట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం వలన రోడ్డు వరకైనా అరికట్ట వచ్చున్నారు. రోడ్డు నియమాలపై ప్రజల్లో అవగాహనా కల్పిస్తూ ఉండాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: