కృష్ణా జిల్లాలో ఓ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు బాట పట్టి ఏళ్ళు గడిచిపోతున్నాయి. సరైన నాయకత్వం లేకపోవడం వల్ల ఆ రెండు చోట్ల వరుసగా టీడీపీ ఓటమి పాలవుతూ, గెలుపు మాటనే మరిచిపోయింది. ఇక గెలుపు ఊసు లేకపోవడంతో, ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీనే క్లీన్ స్వీప్ చేసే అవకాశముందని తెలుస్తోంది. అసలు టీడీపీ గెలుపు దూరమైన రెండు నియోజకవర్గాలు తిరువూరు, నూజివీడు.

 

తిరువూరులో టీడీపీ చివరిసారిగా 1999లో గెలిచింది. ఇక 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తోంది. గత రెండు పర్యాయాలు ఇక్కడ నుంచి వైసీపీ తరుపున రక్షణనిధి గెలుస్తూ...వస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారికి ఎల్లప్పుడు అండగా ఉంటున్నారు….కాబట్టే ఆయన వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ఇక ఇదే ఊపుని స్థానిక సంస్థల్లో కూడా కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు.

 

తన నియోజకవర్గ పరిధిలో ఉన్న విసన్నపేట, గంపలగూడెం, తిరువూరు రూరల్, ఏ కొండూరు జెడ్పీటీసీల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని చూస్తున్నారు. అదేవిధంగా తిరువూరు నగర పంచాయితీలో వైసీపీ జెండా ఎగరవేయాలని కష్టపడుతున్నారు. అటు నూజివీడులో టీడీపీ గత రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. గత రెండు పర్యాయలుగా వైసీపీ నుంచి మేకా ప్రతాప్ విజయం సాధిస్తున్నారు.

 

నూజివీడుపై మేకాకు గట్టి పట్టుంది. తనదైన శైలిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు కాబట్టి, ఇక్కడ మేకా తిరుగులేని నేతగా ఉన్నారు. ఈ విధంగా నూజివీడులో దూసుకెళుతున్న మేకా, స్థానిక సంస్థల్లో కూడా దుమ్ములేపాలని అనుకుంటున్నారు. అటు టీడీపీలో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పెద్దగా కష్టపడటం లేదని తెలుస్తోంది. పైగా ఆయనపై కొందరు తమ్ముళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. 

 

దీంతో నియోజకవర్గంలో టీడీపీ గెలుపు చాలా కష్టమని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్న అగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు రూరల్ మండలాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలని గెలిచే అవకాశముందని తెలుస్తోంది. అలాగే నూజివీడు మున్సిపాలిటీపై కూడా వైసీపే జెండా ఎగిరే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే ఈ రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్ స్పీడ్ ఓ రేంజ్‌లో ఉందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: