ఏపి రాజకీయాల్లో రోజు రోజు కో ట్విస్ట్ నెలకొంటుంది.  ఒకప్పుడు  టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఐదేళ్ల పాలనలో ఏమీ ఉద్దరించలేదని.. ప్రజలను మభ్యపెట్టడం వరకే పాలన సాగిందని.. అందుకే ప్రజలు ఈసారి వైసీపీ కి పట్టం గట్టారు.  ఏపిలో  గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ కి అఖండ విజయం కట్టబెట్టారు.  సీఎం గా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు.  ప్రస్తుతం ఏపిలో అభివృద్ది పథంలో జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు.  ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని ఆయన పొందుతున్నారు.. దాంతో ఇతర పార్టీలో ఉన్న నేతలు వైసీపీలో కి జంప్ అవుతున్నారు. 

 

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనకు నమ్మకం ద్రోహం చేసినప్పటికీ ఇన్నాళ్లూ తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి కారణం నందమూరి బాలకృష్ణపై ఉన్న అభిమానంతోనే అని ఇవాళ వైసీపీ లో చేరిన కదిరి బాబూరావు అన్నారు.  వాస్తవానికి నేను 2014 లో వైసీపీలో చేరాలని అనుకున్నప్పటికీ.. బాలకృష్ణతో తనకు ఉన్న స్నేహం, సత్సంబంధాలు, ఆయనపై తనకు ఉన్న నమ్మకంతోనే టీడీపీలో కొనసాగాల్సి వచ్చిందని అన్నారు.  2019 ఎన్నికల్లో తనను కనిగిరికి బదులు దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించిన విషయమై చంద్రబాబుకు బాలకృష్ణ చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. బాలకృష్ణను వదిలి వెళ్లాలంటే తనకు బాధగా ఉంది కానీ, చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేనని, అక్కడ ఇమడలేనని చెప్పారు. 

 

కేవలం తన స్వార్థం కోసమే ఆయన రాజకీయాలు నడుపుతున్నారని.. అది ప్రజలు తిరస్కరించారని అన్నారు.  ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని.. మంచి చెడు వారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు.  మభ్యపెట్టే రాజకీయాలు ఎప్పటికీ ముందుకు సాగవని అన్నారు.   బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అని, ఎన్టీఆర్, బాలకృష్ణలు చంద్రబాబు లాంటి వాళ్లు కాదని ‘హండ్రెడ్ పర్సంట్‘ చెప్పగలనని అన్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణలు దేవుడి లాంటి వ్యక్తులను కొనియాడారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: