మొన్నటివరకు చైనా దేశంలో మరణ  మృదంగం మోగించి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నది కరోనా  వైరస్. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ చైనా దేశంలో తగ్గుముఖం పట్టినప్పటికీ... మిగతా దేశాలలో మాత్రం విజృంభిస్తోంది. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అన్ని అలెర్ట్  అయిపోయాయి. ఇక ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ భారతదేశంలోకి కూడా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ప్రాణాంతకమైన వైరస్ బారినపడి ఇప్పటికే భారతదేశంలో ఏకంగా 40 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత ప్రజలు కూడా ప్రాణభయంతో బతుకుతున్నారు. ఎక్కడ కరోనా  వస్తుందోనని ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్నారు

 

 

 ఇక కరోనా  వైరస్ సోకిన వారికి ప్రత్యేకంగా ఐసొలేషన్  వార్డ్ లలో  ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్న విషయం. ఇక ఇండియాలో రోజురోజుకు కరోనా  అనుమానితుల సంఖ్య కూడా పెరిగిపోతూ వస్తోంది.ఈ నేపథ్యంలో కేరళ లోని ప్రసిద్ధ శబరిమల దేవస్థానం బోర్డు భక్తులకు ఓ విజ్ఞప్తి చేసింది.నెల వారి  పూజా కార్యక్రమాల అనంతరం మార్చి నెల ముగిసే వరకు  భక్తులు ఆలయానికి రావద్దు శబరిమల దేవస్థానం బోర్డు భక్తులను కోరింది. కరోనా  వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అనుగుణంగానే,.. శబరిమల దేవస్థానం బోర్డు  కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ బోర్డు  ప్రెసిడెంట్ వాసు తెలిపారు . అయితే ఆలయంలో యధావిధిగా స్వామి వారికి పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి అంటూ ఆయన తెలిపారు. 

 

 

 అయితే ఈ విషయం తెలియకుండా ఎవరైనా భక్తులు స్వామి దర్శనం కోసం వస్తే వారిని ఆపే ప్రయత్నం చేయమంటూ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే కేరళ రాష్ట్రంలో 12 కరోనా  కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అటు ప్రభుత్వం కూడా కీలక చర్యలు చేపట్టింది. కేరళలోని పాఠశాలలు మార్చ్  ఆఖరి వారం వరకు సెలవులు ప్రకటించింది కేరళ సర్కార్. అంతేకాకుండా ఎలాంటి వేడుకలు చేసుకోకూడదు అని  ప్రకటించండి.పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేరళ రాష్ట్రంలో కరోనా  ప్రభావం ఎక్కువగా జిల్లాలోనే  శబరిమల ఆలయం ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: