ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో మోసాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రేమ అంటే ఎన్నో మధురానుభూతులు ఉండేది. కానీ ఇప్పటి ప్రేమలో మాత్రం కేవలం అవసరాలు మాత్రమే కనిపిస్తున్నాయి.  కొంతమంది డబ్బులు అవసరం కోసం ప్రేమిస్తే... ఇంకొంతమంది శారీరక అవసరం కోసం ప్రేమిస్తున్నారు. ఇలా అవసరాల కోసం పుట్టిన ప్రేమలు అవసరాలు తీరాక దూరమై పోతున్నాయి. ఇక్కడ ఓ యువతికి ఇలాంటి ఘటన ఎదురైంది. ఇక్కడ ఓ మైనర్ బాలికపై ఓ యువకుడిని ప్రేమించింది. ఆ మైనర్ బాలికను శారీరకంగా వాడుకోవాలని భావించిన సదరు యువకుడు ... ఆ యువతికి మాయమాటలు చెప్పి శారీరకంగా ఎన్నో సార్లు కలిసాడు. ఇక ప్రియుడితో సన్నిహితంగా గడపడమే ఆమె పాలిట శాపంగా మారి పోయింది. సంతోషాన్ని పంచుతాడు అనుకున్న ప్రియుడు  తన జీవితాన్ని రోడ్డున పడేలా చేసాడు.  

 

 

 దీంతో అవమానాన్ని తట్టుకోలేక పోయిన సదరు బాలిక తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది . దీంతో తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలిపోయింది. ఈ ఘటన గుజరాత్లోని అలహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే... పదహారేళ్ల బాలిక యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే ఎవరికీ తెలియకుండా ఆ యువకుడితో రహస్యంగా  ఎంతో సన్నిహితంగా మెలిగింది. అయితే బాలికతో ప్రైవేటుగా ఈ సమయంలో ఉన్న సమయంలో  ఓ వీడియోని చిత్రీకరించాడు ప్రియుడు. అంతటితో ఆగకుండా ఆ బాలికతో రహస్యంగా సన్నిహితంగా ఉన్న వీడియోను మిత్రులకు కూడా పంపించాడు. ఆ మిత్రులు వీడియోను  ఇంకొంత మందికి షేర్ చేశారు. 

 

 

 ఇలా ఎంతో సంతోషంగా చూసుకుంటాడు అనుకున్న ప్రియుడు ఆ బాలిక మానాన్ని  పరువును రోడ్డు మీద పడేసాడు. ఇక ఈ విషయం బాలిక తల్లిదండ్రుల వరకు వెళ్లడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రైవేటు ఫోటోలు వీడియోలు అన్ని అందరికీ తెలిసేలా చేసి  నవ్వుల పాలు కావడంతో తీవ్ర మనస్థాపానికి చెందింది సదరు బాలిక. దీంతో చావే శరణ్యం అనుకుంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు  ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రియుడి అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సదరు యువత వీడియోలను  ఇతరులకు షేర్ చేసిన  స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: