నిజానికి కొంత మంది డబ్బులు సేవ్ చేసుకొనడానికి వివిధ మార్గాలని వెతుకుతుంటారు . ఇందుకోసం మంచి రాబడిని అందించే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా అధిక రాబడులని పొందవచ్చు. ఇందుకు మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మంచి రాబడిని కాస్త దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

 


ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ లో డబ్బులు పోగు చేసుకున్నవారు, వారు గాని చేసే వారు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ ట్రిక్స్‌ తో దీర్ఘకాలంలో సులువుగా కోటీశ్వరులు కావొచ్చు. నెలనెలకి మ్యూచువల్ ఫండ్స్‌ సిప్‌ లో "వార్షిక స్టెప్ అప్ టిప్స్" కూడా ఇందులో ఒక భాగం. మ్యూచువల్ ఫండ్స్‌ లో 20 సంవత్సరాలు లేదా ఆపైన ఇన్వెస్ట్‌మెంట్లను కనుక కడితే ఏకంగా 15 - 17 శాతం వరకు రాబడిని పొందొచ్చని   నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఎక్కువ కాలం అయితే ఈక్విటీ మార్కెట్ నుంచి కనీసం 12 శాతం రాబడిని పొందవచ్చని తెలిపారు.  మ్యూచువల్ ఫండ్స్‌ లో 20 ఏళ్లు లేదా ఆపైన ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే 15 - 17 శాతం రాబడిని లబ్ది పొందవచ్చని తెలుపుతున్నారు.

 

 

ఒక వేళా ఉదహరానికి మనం 15 శాతం వార్షిక రాబడి ప్రాతిపదికన చూస్తే, రోజుకు రూ.200 అంటే నెలకు కేవలం రూ.6,000 మ్యూచువల్ ఫండ్స్‌ లో 30 సంవత్సరాలపాటు ప్రతి నెలా సిప్ రూపంలో పెట్టుబడి చేస్తే.. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌ లెక్కల ప్రకారం మెచ్యూరిటీ కాలంలో మీకు ఏకంగా రూ.4.15 కోట్లు లభిస్తాయి. అయితే ప్రతి నెలా మీరు కచ్చితంగా సిప్ చేస్తూ వెళ్లాలి. అదే మీరు కేవలం సిప్ మాత్రమే కాకుండా "స్టెప అప్ ట్రిక్ ఫాలో" అయితే ఇంకా ఎక్కువ రాబడి పొందొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: