మారుతీ రావు ఆత్మహత్య కేసు ని విచారిస్తున్న పోలీసులకు రోజుకొక ట్విస్ట్ తో దిమ్మతిరిగిపోతుంది. ఇప్పటివరకూ మారుతీ రావు మృతిని ఆత్మహత్య గానే పరిగణించిన పోలీసులు కొంచెం లోతుగా విచారిస్తే ముందుగా అతని సోదరుడి పైన అనుమాన పడ్డారు. అయితే ఇప్పుడు మారుతి ఆర్థిక పరిస్థితి మరియు అతని మానసిక వేదన గురించి తెలుసుకున్న వారు అతని కేసుని విచారించే క్రమంలో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 

 

IHG

 

తన కూతురి భర్తను హత్య చేసిన మారుతీ రావు జైలుకు వెళ్లి బెయిలు మీద బయటకు వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్యకు పాల్పడడం అందరిననీ చాలా అనుమానానికి గురిచేసింది. కూతురి ప్రేమ మరియు పెళ్లి వ్యవహారం ఓర్చుకోలేక అల్లుడిని హత్య చేయడం ముమ్మాటికీ తప్పే అయినా మారుతీ రావు ఇప్పటికే చాలా మానసిక వేదన అనుభవించాడని అతని భార్యతో పాటు బంధుమిత్రులు కూడా చెబుతున్నారు. అయితే ప్రణయ్ హత్య కేసులో మారుతీ రావు సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్న బీహార్ గ్యాంగ్ వల్లే ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకున్నాడని కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 

 

IHG

 

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులైన సుభాష్ శర్మ, అబ్దుల్ బారీ, కరీం బెయిల్ మీద బయటకు రాగా.. అస్ఘర్ అలీ అనే నిందితుడు జైల్లోనే ఉన్నాడు. వీరికి ఉగ్రమూలాలు ఉన్నాయి. జైలు నుంచి బయటకొచ్చిన నిందితులు మారుతీరావును డబ్బు కోసం ఒత్తిడి చేశారని సమాచారం. ఎంత డబ్బు ఇచ్చినా.. ఇంకా ఇంకా ఇవ్వాలని ఒత్తిడి చేశారని తెలుస్తోంది. మరోవైపు ఆయన ఆస్తులను విక్రయిద్దామని భావించినా.. ఎవరూ కొనడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో మారుతీ రావు చావుపై కొత్త అనుమానులు మొదలయ్యాయి.

 

IHG

 

ఇదే క్రమంలో పోలీసులు అసలు మారుతి రావు ఈ విషాన్ని ఏ రూపంలో తన శరీరంలోకి తీసుకున్నాడో తెలుసుకోమని ఫోరెన్సిక్ నిపుణులకు ఆదేశించినట్లు సమాచారం. అతనికి విషం ఎలా వచ్చిందో తెలిస్తే అది అతనికి ఎవరు ఇచ్చారో.... అసలు బెదిరించి ఇచ్చారా అన్న విషయం కూడా బయటకు వస్తుంది.

 

IHG

 

అదే కాకుండా ఈ మధ్యనే మారుతీ రావు కి సంబంధించిన ఇంటి కాంపౌండ్ లో ఒక గుర్తు తెలియని శవం దొరికింది. అది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటే అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారే నా శవాన్ని కూడా అక్కడ ఉంచి ఉండాలని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేకపోయినా ఆ బీహార్ వారిని ని మాత్రం కస్టడీలోకి తీసుకుని పోలీసులు వారి స్టైల్ లో విచారిస్తే అన్నీ బయటకు వస్తాయి అని అంతా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: