గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వంలో ఒకటే చర్చ నడుస్తుంది అదే రాజ్యసభ స్థానాలు ఎవరికి కేటాయిస్తారు అనేదానిపై. అయితే రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కాగా దానికిగాను నలుగురు పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. ఇక ఈ పేర్లలో కేసిఆర్ రాజకీయ వారసురాలు  కవిత కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు కేసిఆర్ ఎవరికీ రాజ్యసభ సీటును కేటాయించాలని అనుకున్నారు అనే విషయంపై ఎవరికి క్లారిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రోజుకొక ఆసక్తికర వార్త తెరమీదికి వస్తూనే ఉంది. కేసిఆర్ తన రాజకీయ వారసురాలు  కవితకు ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించి  మిగతా ఒక రాజ్యసభ స్థానాన్ని వేరే వాళ్ళకి కేటాయిస్తారు అంటూ ప్రచారం కూడా మొదలైంది. 

 

 

 కానీ ఈ రాజ్యసభ స్థానాలు ఎవరికి కేటాయిస్తారు అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా డాక్టర్ కే కేశవరావుకు మరోసారి అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేకే తో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారైపోయింది అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ వీరిద్దరి పేర్లను దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం. రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల నుంచి వీరిని పార్లమెంటుకు పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు టిఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. 

 

 

 అయితే నిజాంబాద్ మాజీ ఎంపీ కేసిఆర్ వారసురాలు కవిత, ప్రొఫెసర్ సీతారాంనాయక్,  మందా జగన్నాథం,  దామోదరరావు, టిఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, హెటేరో సంస్థల అధినేత పార్థసారధి రెడ్డి వంటివారు రాజ్యసభ స్థానాన్ని ఆశించిన విషయం తెలిసిందే. కానీ చివరికి కెకె పొంగులేటి కి ఈ రెండు రాజ్యసభ స్థానాలు ఇచ్చేందుకు కేసిఆర్ ఎక్కువగా మొగ్గుచూపినట్లు సమాచారం. అయితే తమ పేర్లను రాజ్యసభ స్థానాలకు గానూ ఖరారు చేసినట్లుగా తమకు ఎలాంటి సమాచారం ఇప్పటివరకు లేదు అని తెలిపారు ఈ ఇద్దరు . అయితే ఈనెల 13 వరకు నామినేషన్ల ప్రక్రియ గడువు ఉండడంతో వీరి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇక శాసనమండలిలో నిజాంబాద్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిగవర్నర్ కోటా అభ్యర్థిగా సీఎం ఓఎస్డీ  దేశపతి శ్రీనివాస్ పేర్లను కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే మరి కవితకు ఎలాంటి పదవిని ముఖ్యమంత్రి కేసీఆర్ కట్ట  పెట్టబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: