భారతదేశంలో కరోనా ఎఫెక్ట్ భారీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ 40 కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రజలందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. కరోనా తో అంతగా భయపడాల్సిన పని లేదని... ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సరిపోతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.కానీ  ప్రజల్లో మాత్రం ప్రాణభయం పట్టుకుంది. దీంతో ఏం చేస్తే కరోనా  సోకుతుందో అని భయపడి పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలన్న వందసార్లు ఆలోచిస్తున్నారు. కరోనా  పుణ్యమా అని ఎన్నో వదంతులు కూడా తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు కరోనా వైరస్ పేరుతో ఎన్నో వదంతులు తెర మీదికి వచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

 

 

 ముఖ్యంగా ఇలా వచ్చిన వదంతులను లో ముఖ్యమైనది చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుంది అని . చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని... పౌల్ట్రీ ఫార్మ్ కోళ్ళకి కరోనా  వైరస్ సోకింది అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక ఈ వార్తలు అటు ప్రజలను కూడా ఎంతగానో ప్రభావితం చేసాయి. దీంతో మాంసం ప్రియులైన సరే అసలు కనీసం చికెన్ వైపు చూడటానికి కూడా భయపడిపోతున్నారు. చికెన్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అయినా తినొచ్చు... కానీ కరోనా  వచ్చి ప్రాణం పోతే ఇంకెప్పుడూ చికెన్ తినలేం అంటూ అనుకుంటున్నారు. దీంతో చికెన్ షాప్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు పడిపోయాయి. 

 

 

 ఇక కరోనా  ఎఫెక్ట్ తో ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు పడిపోవడంతో చికెన్ షాప్ లన్ని  వెలవెలబోతున్నాయి.  ఈ నేపథ్యంలో చికెన్ షాప్ యజమానులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఇక చిత్తూరు జిల్లా కలికిరి లో 100 రూపాయలకే మూడు కిలోల చికెన్ అందిస్తున్నారు చికెన్ షాపు యజమానులు.  2 నెలల క్రితం 180 నుంచి 200 రూపాయలు పలికినా చికెన్ ధరలు ఇప్పుడు భారీ మొత్తంలో పడిపోయాయి. రోజుకు కనీసం పది కేజీల చికెన్ కూడా అమ్మడం ఎంతో కష్టంగా ఉంది అంటూ చికెన్ షాప్ వ్యాపారులు చెబుతున్నారు. అటు కర్నూలు జిల్లా గూడూరు పంచాయతీలోని 40 రూపాయల కేజీ చికెన్ ఇస్తుండగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: