ప్రపంచ దేశాల్లో కరోనా ఎఫెక్ట్ భారీగా ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కేవలం చైనా దేశం వరకే పరిమితమైన ఈ కరోనా  ప్రభావం ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో  కనిపిస్తోంది. అంతేకాదు ఇప్పుడిప్పుడే చైనా దేశంలో కరోనా వైరస్  తగ్గుతుంటే ఇతర దేశాల్లో మాత్రం ఈ మహమ్మారి కరోనా  విజృంభిస్తోంది. దీంతో చాలా దేశాలు ఇతర దేశాలకు తమ దేశం నుంచి విమాన సర్వీసులను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నప్పటికీ.. కరోనా  ప్రభావం వల్ల ప్రజలు ఎవరు ఎక్కడికి ప్రయాణం చేసేందుకు మొగ్గుచూపడం లేదు. దీంతో విమానాలు అన్ని వెలవెలబోతున్నాయి. విమానంలో ప్రయాణికులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. 

 

 

 ప్రస్తుతం నియామకాల ప్రకారం... విమానాలు నడుపుతున్న సంస్థలు తమకు కేటాయించిన స్లాట్ లలో  కనీసం 80 శాతం ఉపయోగించాలి... లేదా ప్రత్యర్థి  విమానయాన సంస్థలకు వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చైనా మరియు హాంకాంగ్ లాంటి  దేశాల్లో  కరోనా  వైరస్ తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నందున... ఆయా దేశాలు ప్రదేశాలకు వెళ్ళే విమానాలకు ఈ నియమం సడలించినప్పటికీ... చైనా తర్వాత కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించిన ఇరాన్  సహా దక్షిణ కొరియాలో ఇతర గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఈ నియమం  ఇప్పటికీ వర్తిస్తుంది. అయితే ఈ రెండు దేశాల్లో  కరోనా  రోజురోజుకు విస్తరిస్తుండటంతో... ఇక్కడికి వెళ్లేందుకు ప్రయాణికులు దూరంగానే ఉంటున్నారు. దీంతో డిమాండ్ ఒక్కసారిగా తగ్గి పోయింది. 

 

 

 అయితే దేశ ట్రాన్స్ పోర్ట్  సెక్రెటరీ జనరల్ గ్రాంట్  షాప్స్ తాజాగా విమాన సంస్థలకు కేటాయించే స్టాట్లు  ఇచ్చే విమానాశ్రయం కో ఆర్డినేషన్  లిమిటెడ్ కు లేఖ రాశారు. అవసరమైన ఖర్చు మరియు కార్బన్ ఉద్గారాలను నివారించడానికి ఉద్దేశించిన 80/20   నిబంధనను  ప్రస్తుతం... కరోనా  వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా తరలించాలి అంటూ లేఖలో కోరారు. కరోనా  వైరస్ కారణంగా విమానయాన సంస్థలు తమ స్లాట్లను నిలుపుకోవడానికి చాలా తక్కువ మంది ప్రయాణికుల తోనే వెళ్తున్నాయని.. కొన్ని కొన్ని విమానాలు ఎలాంటి ప్రయాణికులు లేకుండానే ఖాళీగానే నడిపిస్తున్నారు... దీని వల్ల భారీ నష్టం వాటిల్లుతోంది అంటూ ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: