అసలైన పిచ్చి  తుగ్లక్ ఎవరో రాష్ట్రంలోని జనాలందరికీ తెలిసిపోయింది. పోటికి అవకాశమే లేని చోట, పార్టీ ఓట్లన్నీ పడతాయో లేదో కూడా స్పష్టంగా చెప్పలేని చంద్రబాబునాయుడు పార్టీ తరపున రాజ్యసభకు పోటి పెడుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన విని  పార్టీలోని నేతల్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏపి నుండి రాజ్యసభలో నాలుగు స్ధానాలు ఖాళీ అయ్యాయి. ఎంఎల్ఏ ఓట్ల ఆధారంగా మొత్తం నాలుగు సీట్లూ వైసిపినే గెలుచుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఓటింగ్ అవసరమైతే ఒక్కో స్ధానానికి 35 ఓట్లు కావాలి. అసెంబ్లీలో ఎంఎల్ఏల సంఖ్యా బలం ప్రకారం నాలుగు సీట్లు వైసిపి ఖాతాలోనే పడతాయి. టిడిపికున్నది 23 మంది ఎంఎల్ఏలే కాబట్టి మామూలుగా అయితే పోటి గురించి కూడా ఆలోచించే అవకాశం లేదు. మంగళవారం మధ్యాహ్నం వరకు చంద్రబాబు కూడా ఆలాగే పోటి విషయంపై ఆలోచించలేదు. కానీ సాయంత్రానికి ఏమైందో ఏమో వెంటనే పార్టీలోని ఎస్సీ నేత వర్ల రామయ్యతో రాజ్యసభ ఎన్నికల్లో పోటి చేయించనున్నట్లు ప్రకటించారు. ప్రకటన విన్న వాళ్ళందరూ ముందు ఆశ్చర్యపోయినా తర్వాత చంద్రబాబుకు ఏదో అయ్యిందని అనుకున్నారు.

 

చేసిందే పిచ్చి ప్రకటన పైగా వైసిపి ఎంఎల్ఏలకు ఓ అప్పీలు కూడా చేశారు. అదేమిటంటే ఓట్లేసేముందు వైసిపి ఎంఎల్ఏలందరూ ఓసారి ఆలోచించుకుని ఓట్లేయాలట. అసలు వైసిపి ఎంఎల్ఏలు ఓట్లేసేముందు తాము తప్పు చేస్తున్నారో... ఒప్పు చేస్తున్నారో ఆలోచించుకోవాలట. తాము చేస్తున్న పని తప్పని అనుకుంటే వర్ల రామయ్యకు ఓట్లేయాలని సూచించటం విచిత్రంగా ఉంది. తప్పని తెలిసినా భయపడితే వైసిపి అభ్యర్ధికి ఓట్లేసినట్లే అని కూడా తేల్చేశారు.

 

చంద్రబాబు అప్పీల్ విన్న తర్వాత నేతలందరూ పాపం అయోమయంలో పడిపోయారు. ఇంత కాలం జగన్మోహన్ రెడ్డిని పిచ్చితుగ్లక్ తో పోల్చిన చంద్రబాబు చివరకు తానే అసలు తుగ్లక్ అని తనంతట తానుగానే ఒప్పేసుకున్నట్లయ్యింది తాజా నిర్ణయంతో. మొత్తానికి తాను ఏమి మాట్లాడుతున్నాడో ? ఏమి చేస్తున్నాడో ? కూడా తెలీని స్ధితిలోకి వెళ్ళిపోయినట్లు అందరికీ అర్ధమైపోయింది. ఈ విషయాన్ని ఊహించేనేమో పార్టీలోని సీనియర్లందరూ బయటకు వచ్చేస్తున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: