సినిమాల్లో సూపర్ పవర్ స్టార్ గా ఉంటూ... హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ... తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేనంతగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత జనసేవ  చేయాలనే ఉద్దేశంతో  రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని జనసేన పార్టీని స్థాపించి జనాల్లోకి వెళ్లారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలను ప్రభావితం చేసినట్లు గానే పవన్ కళ్యాణ్ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తారు అని  అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాగానే దూకుడు చూసి ఏకంగా ప్రధాని మోదీ సైతం పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ఎంతో ఆసక్తిని సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతారు అని అందరూ అనుకున్నారు. 

 

 

 అయితే పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు చంద్రబాబు మద్దతుగా నిలిచి చంద్రబాబు గెలిచి అధికారాన్ని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో కీలకంగా మారిపోయింది. కానీ ఆ తర్వాత చంద్రబాబుతో విభేదాలు రావడంతో... చంద్రబాబు పొత్తు నుంచి తప్పుకొని 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది జనసేన పార్టీ. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధికారాన్ని చేపట్టకపోయినప్పటికీ భారీ మొత్తంలోనే సీట్లు గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది అన్న  విషయం తెలిసిందే. 

 

 

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ఓటమి వెనుక కారణం.. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల గురించి సరైన అవగాహన లేకపోవడం... నీతి నిజాయితీ తోనే ముందుకు వెళ్లాలి అనుకోవడం లాంటి వాటి వల్ల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవలేక పోయారు అని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పలుమార్లు ఇంటర్వ్యూలో కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఎవరిని ప్రలోభ పెట్టకుండానే తమ మీద నమ్మకం తో ఓటు వేసే విధంగా ఉండాలని పవన్ కళ్యాణ్.. న్యాయంగా ఆలోచించడం కారణంగానే ఓడిపోయారట .

మరింత సమాచారం తెలుసుకోండి: