తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా బకరాను చేసేందుకు చంద్రబాబు వెనుదీయడని మరోసారి నిరూపించినట్టయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. గెలిచే అవకాశం లేకపోయినా సరే.. రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయం మీడియాకు చెప్పారు.

 

 

రాజ్యసభ ఎన్నికల్లో తెలుగు దేశం తరపున ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్ల రామయ్యను పోటీ లో పెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఏమాత్రం లేదు.. సాధారణంగా రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టే గెలుపు అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా చూస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలూ వైసీపీకే దక్కుతాయి. కాకపోతే.. టీడీపీ 23 ఎమ్మెల్యే సీట్లు ఉన్నందువల్ల మరోసారి రాజ్యసభ బరిలో దిగాలని టీడీపీ డిసైడయ్యింది.

 

 

అయితే అదే సమయంలో ... రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబే అంగీకరిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలలో గెలుస్తామని కాదని... ప్రభుత్వ ఆగడాలను తెలియచేయడానికే అని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అయితే ఓడిపోయే పోటీలో బరిలో నిలిచేందుకు చంద్రబాబు వర్ల రామయ్యను ఎంపిక చేశారు. అయితే ఇలా వర్ల రామయ్యను చంద్రబాబును బకరా చేయడం ఇదేమీ కొత్త కాదు.

 

 

గత రాజ్యసభ ఎన్నికల సమయంలో వర్ల రామయ్యకు అవకాశం ఇచ్చామని టీడీపీ ప్రకటించిన తర్వాత కూడా మళ్లీ వెనక్కు తీసుకుంది. అప్పట్లో వర్ల రామయ్య తాను రాజ్యసభ సభ్యుడిని అయ్యానని మీడియాకు కూడా చెప్పుకున్నారు. మీడియాలో ప్రముఖంగా ప్రసారమయ్యింది కూడా. కానీ చివరి నిమిషంలో.. కనకమేడల రవీంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వర్ల రామయ్యను చంద్రబాబు బకరా చేస్తున్నారని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: