బిర్యాని ఈ పేరు వినగానే నోటిలో లాలాజలాలు ఊరుతాయి.. అందులో బావర్చి బిర్యాని అంటే ఇంకా మనసు ఊరుకుంటుందా త్వరగా వెళ్లి తినరా అని తొందర పెడుతుంది. ఇక నగరంలో ఉన్న బావర్చి బిర్యాని హోటల్స్ ఒకెత్తైతే శంషాబాద్ ఎయిర్‌పోర్టు బావర్చి హోటల్ ఒకెత్తు.. ఎందుకంటే ఇక్కడ బిర్యాని తింటే రోగాలు రావడం ఖాయమని నిరూపించే సంఘటన జరిగింది..

 

 

ఇకపోతే ఎక్కడెక్కడి నుండో హైదరాబాద్ వచ్చే వారు టేస్టీ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందని ఆరా తీస్తారు. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న గుర్తింపు అలాంటిది. ఇలాంటి ఆశతోనే శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ లో ఉన్న బావర్చీ అనే రెస్టారెంట్‌కు ఇద్దరు వ్యక్తులు బిర్యానీ తినడానికి వెళ్లారు. కానీ, వారు ఆర్డర్ చేసిన బిర్యానీ చూస్తే వాంటింగ్ రావడం ఖాయం... ఎందుకంటే ఆ బిర్యానిలో మటన్ పీసులతో పాటుగా బొద్దింక రావడమే అందుక్కారణం.

 

 

ఇక బిర్యాని ఇమ్మంటే బొద్దింకను కూడా ఇచ్చారేంటని ఆ రెస్టారెంట్ వారిని నిలదీస్తే, మీకు దిక్కున్న చోట చెప్పుకొమ్మని ఎదురుదాడికి దిగడం గమనార్హం. తిక్కరేగిన ఆ కస్టమర్లు  ఆగ్రహానికి గురై శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లేంట్ చేశారు.. మటన్ బిర్యానిలో బొద్ధింక వచ్చిందని వారికి తెలుపగా కనీస మర్యాద కూడా ఇవ్వకుండా, దురుసుగా ప్రవర్తిస్తూ, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు..

 

 

చూసారా అసలే నగరంలో కరోనా వింజృంభిస్తుండగా, ఏదో ఆకలేసి అలాంటి పట్టింపులేవి పట్టించుకోకుండా బిర్యాని తిందామని వెళ్లిన వారిపట్ల దయలేకుండా, బిర్యాని డబ్బులు తీసుకుని, బొద్ధింక ఫ్రీగా ఇస్తే ఏమనుకోవాలి.. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఇలాంటి హోటల్ల మీద అధికారులు ఓ కన్నేసి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే హక్కు వారికి ఎవరు ఇచ్చారు అని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: