ఏపీలో ఫ్యాను గాలి జోరుగా వీస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధమైన వాతావరణం కనిపించిందో ఇప్పుడు గ్రామాల్లోనూ అదేవిధంగా వైసీపీ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగించేలా, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అధికార వైసిపి తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతుండగా, టిడిపి, బిజెపి, జనసేన తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు బతిమిలాడి మరి  నాయకులను పోటీ చేయాల్సిందిగా కోరుతూ రంగంలోకి దించుతున్నారు.

 

అయినా ఆ పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనికి తోడు జగన్ ఈ ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలు, జరగకుండా పూర్తిస్థాయిలో 'నిఘా' ఏర్పాటు చేయడం, డబ్బు ప్రభావం లేకపోవడం తదితర అంశాలతో స్థానిక సంస్థల ఎన్నికల పోరు రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే అధికార పార్టీ వైసీపీలో చేరేందుకు పెద్దఎత్తున నాయకులు పోటీ పడుతున్నారు. ఒక్కొక్కరుగా వచ్చి చేరుతూ పార్టీలో చేరుతూ కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నారు. ఒకపక్క ఎన్నికల హడావుడి, మరోపక్క చేరికల హడావుడి వైసీపీలో కనిపిస్తోంది. ఇప్పటికే కొంత మంది నాయకులు వైసీపీ లో చేరడం మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

 

IHG

పులివెందుల సతీష్ రెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, బాలరాజు తో పాటు చాలా మంది నాయకులు అధికార పార్టీలో చేరిపోవడంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంలో ఆందోళన నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది నాయకులు వలస వెళ్లే అవకాశం ఉండడంతో చంద్రబాబులో భయం ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల తరువాత మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: