కరోనా ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది. కోట్ల మందిని ఇళ్ల కే పరిమితం చేస్తోంది. చైనా, ఇటలీలో కోట్ల మంది ఇంకా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు కరోనా పేరు చెబితేనే.. గుండె దడదడలాడుతోంది. అలాంటిది కొందరు మాత్రం కరోనానే వణికిస్తున్నారు.. ఇప్పుడు ఇండియాలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే... ముందుగా ఏం చేస్తారు.. శాంపిల్స్ ఎక్కడకు పంపిస్తారో తెలుసా...?

 

 

ఇలాంటి కరోనా శాంపిల్స్ అన్నీ పుణెలోని నేషనల్ వైరాలజీ సంస్థ వంటి వైరాలజీ సంస్థల వద్దకు వెళ్తాయి. అక్కడ ఈ శాంపిల్స్ పరిశీలించిన వైరాలజిస్టులు వాటి కథేంటో తేలుస్తారు.. అంటే ఒక రకంగా ఆ వైరస్ లను గుర్తించి వాటిని ప్రాణాలు తీసేందుకు సహకరించేది వీళ్లే అన్నమాట. అందుకే ఈ వైరాలజిస్టులను ...దేశాలను గడగడలాడించే వైరస్‌లకే దడపుట్టించే వాళ్లుగా చెప్పుకోవచ్చు.

 

 

ఈ వైరాలజిస్టులు వైరస్ ల గుట్టువిప్పి, కట్టడి చేసి జనానికి రక్షణ కల్పిస్తారు. మరి ఇలాంటి వైరాలజిస్టులు కావాలంటే.. కొన్ని కోర్సులు చేయాలి. పలు సంస్థలు, విశ్వవిద్యాలయాలు వైరాలజీ విభాగంలో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చేస్తే వైరాలజిస్టులు అవుతారు. ఈ వైరాలజిస్టులు వైరస్ లను గుర్తించడమే కాకుండా ఈ వైరస్‌లు మానవ జీవితాలను నాశనం చేయడకుండా రక్షించేందుకు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు.

 

 

కంటికి కనిపించని వైరస్ ల ప్రభావాన్ని గుర్తించి... విస్తృత పరిశోధనలు జరిపి.. కొన్ని వ్యాక్సీన్లను అందుబాటులోకి తెస్తారు. అంతే కాదు.. ఇలాంటి వైరస్ లో వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటారు. దాడిచేసిన వైరస్‌ ఏ రకమైనదో గుర్తించి దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సీన్లు రూపొందిస్తారు. అందుకే వీరు వైరస్ అమ్మ బాబులకే మొగుళ్లన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: