స్ధానిక సంస్ధల ఎన్నికలకు ఇలా  నగారా మోగిందో లేదో చంద్రబాబునాయుడును అలా సమస్యలు కమ్ముకుంటున్నాయి.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుండి అసలు కోలుకోనే లేదు. ఇంతలోనే దెబ్బ మీద దెబ్బ పడుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అయినా పోరాటం చేసి కాస్త పుంజుకుందామని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేట్లు ఎక్కడా కనబడటం లేదు. ఎందుకంటే వివిధ జిల్లాల్లోని కీలక నేతలు కొందరు టిడిపికి రాజీనామా చేయటానికి రెడీ అయిపోతున్నారు.

 

కడప జిల్లాలో కీలక నేత అయిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రెండో మూడు రోజుల్లో తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. అలాగే గుంటూరు జిల్లాలో మరో సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా సోమవారం రాజీనామా చేసేశారు. గతంలో ఎంఎల్సీగా రాజీనామా చేసిన డొక్కా తాజాగా పార్టీకి కూడా రాజీనామా చేయటం సంచలనంగా మారింది.  అయితే  జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు డొక్కానే కౌంటర్ ఇస్తుండటంతో వైసిపిలో చేరటం ఖాయమనే అందరికీ అనిపిస్తోంది. ఓ నాలుగు రోజులు పోతే ఇంకెతంమంది నేతలు బయటకు వచ్చేస్తారో తేలుతుంది.

 

అలాగే వైసిపి దూకుడును తట్టుకోవటం కష్టమన్న భావన టిడిపి సినయర్ నేతల్లోనే బాగా కనిపిస్తోంది. అందుకనే స్ధానిక సంస్దల ఎన్నికల నుండి తప్పుకోవాలని చాలామంది సీనియర్లు నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని టెలికాన్ఫరెన్స్ సమావేశం సందర్భంగా ఇప్పటికే చంద్రబాబుకు చెప్పేశారట. అలాగే పోటి చేయబోయే అభ్యర్ధులకు ఆర్ధిక వనరులు సమకూర్చే బాధ్యత నుండి పార్టీ తప్పుకున్నట్లు ఇప్పటికే చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. పార్టీ డబ్బులు పెట్టకుండా తామే సొంతంగా ఖర్చులు పెట్టుకోవటానికి నేతలు ఇష్టపడటం లేదు.

 

ఇక జనాల మూడ్ కూడా చంద్రబాబు, టిడిపి నేతలు, పచ్చపత్రికలు చెబుతున్నంతగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ లేదు.  ఈ విషయం వాళ్ళకు కూడా బాగా తెలుసు. కాకపోతే ప్రభుత్వంపైకి జనాలను రెచ్చ గొడితే మనకు మద్దతుగా నిలవకపోతారా అనే పిచ్చి ఆలోచనతోనే బురద చల్లుతున్నారు. అయితే జనాలు రెస్పాండ్ కావటం లేదు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: