దేశంలోనే అతి పెద్దదైన బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు మళ్ళీ ఒకసారి షాకిచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను మరొకసారి తగ్గించి ఖాతాదాడులకు దెబ్బ తీసింది. నిజానికి ఇది ఖాతాదారులకు మింగుట పడని విషయమే. దీనికి కారణం ఒక నెల రోజుల వ్యవధిలో వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండోసారి కాబట్టి. ఈ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం మార్చి 10 నుంచే అంటే నిన్నటి నుండే అమలులోకి వచ్చిందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. sbi ఇదివరకే ఫిబ్రవరి 10వ తేదీన FD రేట్లను తగ్గించిన విషయం అందరికి తెలిసిందే. దీనితో తాజాగా రేట్ల కోత  దృష్ట్యా 7 - 45 రోజుల కాల పరిమితిలో sbi ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే ఇవ్వబోతుంది.

 

 

 

ఇదే కాలపరిమితికి ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.5 శాతంగా ఉండేది. అలాగే 1 - 5 సంవత్సరాల మధ్య కాల పరిమితిలోని FDలపై ఇప్పుడు కేవలం 5.9 శాతం వడ్డీ రేటు ఇవ్వనుంది. ఇంతక ముందు  ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6 శాతంగా ఇచ్చేవారు. అలాగే స్టేట్ బ్యాంక్ దీర్ఘకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లని తగ్గించేసింది. 5 - 10 సంవత్సరాల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై ఇప్పుడు 5.9 శాతం వడ్డీ రేటు ఇవ్వబోతుంది. ఇంతక ముందు వీటిపై వడ్డీ రేటు 6 శాతంగా ఇచ్చేవారు. 

 

 

 

ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌ కు సాధారణ కస్టమర్లతో పోలిస్తే ఎఫ్‌డీలపై 50 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీ వారికి లభిస్తుంది. కాకపోతే వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో ఇకపై స్టేట్ బ్యాంక్‌ కు వెళ్లి డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని భావించే వారికి ఇక అటు వైపు వెళ్లరని చెప్పవచ్చు. ఇంకా ఇదివరకే బ్యాంకులో ఉన్న ఎఫ్‌డీల మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత వాటిని రెన్యూవల్ చేస్తే, అప్పుడు కూడా నిన్నటి నుండి అమలులో ఉన్న తక్కువ వడ్డీ రేటు మాత్రమే అమలులోకి వస్తుంది.

 

 

దీనితో స్టేట్ బ్యాంక్ ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గించడం వల్ల ఇతర బ్యాంకులు కూడా ఎస్‌బీఐ దారిలో నడిచే అవకాశం లేకనూ పోలేదు. దీని వల్ల మొత్తంగా చూస్తే బ్యాంకింగ్ రంగంలో ఎఫ్‌డీలపై తక్కువ రాబడి రావొచ్చని పూర్తి అంచనాకు రావొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: