ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.  ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీకి పట్టం కట్టారు.  సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై ఇప్పుడు ఇతర పార్టీల నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.  పులివెందులలో టీడీపీకి బలమైన నాయకుడిగా ఉన్న సతీశ్ రెడ్డి నిన్న పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే.. విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన కీలక నేతలు పార్టీని వీడారు. మంగళవారం మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన కుమార్తె డాక్టర్‌ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌ కుమార్‌, టీడీపీ నాయకులు గుడ్ల సత్యారెడ్డి, విజయసాయి, వ్యాపారవేత్త చిక్కాల రవి నాయుడు, పి.ఉషశ్రీ, జనసేన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, పివి సురేష్, కొణతాల సుధ తదితరులు వైఎస్సార్‌సీపీలోకి చేరిన విషయం తెలిసిందే. తాజాగా విశాఖలో టీడీపీ మరో షాక్ తగిలింది. 

 

టీడీపీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు ఆ పార్టీకి గుడ్‌బాయ్‌ చెప్పారు. త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి రమేష్‌ బాబు తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు.  గత ఆరునెలలుగా వైసీపీ సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా రమేష్ బాబు ఇవాళ సాయంత్రం లేదంటే రేపు ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. 

 

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన పాటనలో దూకుడు పెంచాడని.. అవినీతి నిర్మూలనకు కంకణం కట్టుకున్నాడని.. అలాంటి నేతనే ప్రజలు నమ్ముతారని.. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నేత వైపు అడుగులు వేయాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నామని వైసీపీ పార్టీలో చేరిన నాయకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: