రోజురోజుకు బలం పెంచుకుని టీఆర్ఎస్ కు దీటైన పార్టీగా నిరూపించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలతో తమ వేళ్ళతో తమ కంటినే పొడుచుకునే విధంగా తయారయింది. ఒకరి ఎదుగుదల మరొకరు ఓర్చుకోలేని విధంగా నాయకుల వ్యవహారం ఉంటోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో సీనియర్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా తో కేసీఆర్ ఫామ్ హౌస్ ను తన అనుచరుల ద్వారా చిత్రీకరించారు. దీంతో ఆగ్రహం చెందిన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ పై కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది.

IHG


 సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం లో మౌనంగా ఉండిపోయారు. రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ తరుపున స్పందించేందుకు ఎవరూ ఇష్టపడకపోవడంతో తెలంగాణ తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం అవుతోంది. రేవంత్ రెడ్డి అరెస్టు అక్రమం అంటూ కాంగ్రెస్ లో ముఖ్య నేతలందరూ ముందుగా ఖండించినా, ఇప్పుడు ఈ అంశంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం నాయకులు రేవంత్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం దీన్ని రాజకీయం చేయడం తగదని చెబుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు దామోదర రాజనర్సింహ దీనిపై స్పందిస్తూ రేవంత్ లేవనెత్తిన అంశం కంటే ముఖ్యమైన సమస్యలు తెలంగాణలో చాలా ఉన్నాయని, భూవివాదాలు ఏవైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించడం తో రేవంత్ వర్గీయులు మండిపడుతున్నారు.

IHG drone cemera


 ఇక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా దాదాపు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ జీవో అమలులో ఉన్న పలు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని గతం నుంచి ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మల్లురవి, ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేవంత్ కు మద్దతుగా నిలుస్తూ ఆయన తరఫున గొంతు వినిపిస్తున్నారు. ఏమైనా రేవంత్ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండుగా చీలిపోవడం, ఏకాభిప్రాయంతో లేకపోవడంతో టిఆర్ఎస్ మరింత దూకుడుగా కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు ఉత్సాహంగా ముందుకు కదులుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: