ఏపిలో ఇప్పుడు వలసల పర్వం మొదలైంది.  స్థానిక సంస్థల ఎన్నికల వేళ లో ప్రతిపక్ష టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీ గుడ్ బై చెప్పారు. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు టీడీపీకి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నిన్న  మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన కుమార్తె డాక్టర్‌ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌ కుమార్‌, టీడీపీ నాయకులు గుడ్ల సత్యారెడ్డి, విజయసాయి, వ్యాపారవేత్త చిక్కాల రవి నాయుడు, పి.ఉషశ్రీ, జనసేన సీనియర్ నాయకులు పివి సురేష్, కొణతాల సుధ తదితరులు వైఎస్సార్‌సీపీలోకి చేరిన విషయం తెలిసిందే.

 

మరికొంత మంది టీడీపీ సీనియర్, జూనియర్ నేతలు సైతం వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత ఎంపి విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేధికగా దుమ్ముదుళిపేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థులుగా ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణతో పాటు మరో ఇద్దరిని సీఎం జగన్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే.  అయితే కొంత మంది టీడీపీ నేతలు జగన్ రాజ్యసభ ఎన్నికల్లో విషయంలో తన ఐనవారికే పట్టం కడతారని ప్రతిపక్షాలు పుకార్లు చేస్తున్నారు.

 

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.  విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదు. నమ్మిన వాళ్లను తొక్కేయడంలో దిట్ట. మోపిదేవి, బోస్ ల పార్టీ విధేయతను గుర్తించి సీఎం జగన్ గారు ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే నీకూ జగన్ గారికి తేడా' అని విజయసాయిరెడ్డి.. చంద్రబాబు పై సెటైర్లు వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: