ఈ మధ్య కాలంలో కొందరు చేస్తున్న పనుల వల్ల ప్రభుత్వ కార్యాలయాల పరువు పోతుంది. నరసరావుపేటలో ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. . డాక్టర్లు, సిబ్బంది ఆస్పత్రికి వచ్చే మహిళలను లోబరచుకుంటుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. 
 
తాజాగా నరసరావుపేటలో జరిగిన ఒక ఘటన ప్రభుత్వ ఆస్పత్రులకు మహిళలు వెళ్లాలంటే భయపడేలా చేస్తోంది. నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో శానిటేషన్ విధులు నిర్వహించే ఒక ఉద్యోగి చికిత్స కోసం వచ్చిన ఒక రోగి సహాయకురాలికి మాయమాటలు చెప్పి ఆస్పత్రిలోని ఒక గదిలో  యువతితో సన్నిహితంగా మెలిగాడు. రోగి బంధువుతో ఉద్యోగి సన్నిహితంగా మెలగడం ఇతర సిబ్బంది గమనించి వారు బయటకు వెళ్లకుండా బయటినుండి గడియపెట్టారు. 
 
బయట గడియ పెట్టడంతో భయపడిన ఉద్యోగి వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తలుపు గడియ తీయాలని స్నేహితుల సహాయం కోరాడు. అతని స్నేహితులు వచ్చి అతడు చెప్పిన విధంగా మహిళను బయటకు పంపించి ఉద్యోగిని లోపలే ఉంచి గడియ పెట్టారు. మిగతా సిబ్బంది ఈ విషయాన్ని ఆస్పత్రి ఇంచార్జ్ కు తెలియజేశారు. ఈ విషయం రోగులకు తెలియడంతో కొంత సమయం పాటు ఆస్పత్రిలో హైడ్రామా నడిచింది. 
 
విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఒక డాక్టర్ ఆస్పత్రికి చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గది లోపలికి వెళ్లగా అక్కడ ఉద్యోగి మాత్రమే ఉండటంతో అక్కడినుండి వెళ్లిపోయారు. ఆస్పత్రి సిబ్బంది ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని  చెబుతున్నారు.                  

మరింత సమాచారం తెలుసుకోండి: