ఇంకొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే ప్రస్తుతం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించి కిందిస్థాయి క్యాడర్ ను బలోపేతం చేసుకొని పార్టీకి బలం చేకూరే విధంగా చేసుకోవాలని  పావులు కదుపుతున్నాయి అన్ని పార్టీలు . ఇప్పటికే ప్రతిపక్ష టిడిపి పార్టీ అధికార వైసిపి పార్టీ తో పాటు బిజెపి జనసేన పార్టీ లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల పోటీ కోసం సిద్ధమయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయబోతున్నాయి అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే మొన్నటి వరకు సిపిఎం సిపిఐ పార్టీ లు కలిసి నడిచిన విషయం తెలిసిందే. 

 

 

 మామూలుగానే కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు న్యాయం చేయడానికి పోరాటం చేస్తూ ఉంటాయి అన్న విషయం ప్రజలకు కూడా తెలుసు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాకుండా ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ పార్టీలు ఏర్పడ్డాయని ప్రజలకు తెలిసినప్పటికీ ప్రజలు మాత్రం కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు వేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపరు ఈ నేపథ్యంలో రోజురోజుకు కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడుతూ వస్తున్నాయి. అయితే తాజాగా సిపిఐ పార్టీ తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా మెలిగేందుకు  ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే సిపిఐ తెలుగుదేశం పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. సిపిఐ పోటీ చేస్తున్న స్థానాలు తెలుగుదేశం పోటీ చేయకూడదని... తెలుగుదేశం పార్టీ చేస్తున్న స్థానాల్లో సిపిఐ పోటీ చేయకూడదని చంద్రబాబుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు సిపిఐ నాయకుడు రామకృష్ణ. 

 


 అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. సిపిఐ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకున్నా తప్పేమీ కాదని కానీ... సిపిఐ పార్టీ టిడిపి పార్టీ తో సహజీవనం చేసినట్లు గా చేస్తోంది అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే అటు పొత్తు పెట్టుకున్నట్టు  కాదు ఇటు వ్యతిరేకం అన్నట్లు కూడా కాదు. మామూలుగానే టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు.. కొన్ని సార్లు పోటీ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యయి.  ఇప్పుడు పొత్తే  లేకుండా టిడిపి పార్టీతో ఒప్పందం పెట్టుకోవడం వల్ల సిపిఐ పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీనిపై కమ్యూనిస్టు పార్టీలు చివరికి ఏం నిర్ణయం తీసుకోబోతున్న అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: