ఇంకొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధన కారణంగా.. ఆంధ్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు మద్యం పంచ కూడదు అని నిబంధన పెట్టింది జగన్ సర్కారు.. ఒకవేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు  డబ్బు మద్యం పంచినట్లు గా నిర్ధారణ అయితే వారిపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. ఒకవేళ ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా డబ్బు మద్యం పంపిణీ చేసినట్లు నిర్ధారణ అయితే.. మూడేళ్లు జైలు శిక్షతో పాటు అనర్హత వేటు కూడా వేస్తామని చెబుతోంది జగన్ సర్కార్. ఇది ప్రతిపక్ష టిడిపి క్యాడర్ ను  కాస్త భయాందోళనకు గురి చేస్తున్న అంశమే. 

 


 అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడి పారి పోవడం కాదు ఎదురించి పోరాడుతాం అంటుంటారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కీలక నేతలు పార్టీని వీడుతున్న ధైర్యంతో ప్రజా చైతన్య యాత్ర కు సంకల్పించారు. ఇక ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకొచ్చిన నిబంధన బాగానే ఉందని కానీ అది కేవలం ప్రతిపక్ష పార్టీకి మాత్రమే కాకుండా అధికారపక్షం కూడా అదే నిబంధన ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది అంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ సర్కార్ ప్రస్తుతం ప్రతి విషయంలో టిడిపి క్యాడర్ పై కాస్త గుర్రుగానే ఉన్న నేపథ్యంలో టిడిపి క్యాడర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. 

 

 అయితే మామూలుగానే చంద్రబాబు ఎంతో మాస్టర్ మైండ్ ప్లాన్ వేస్తూ ముందుకు సాగుతారు అన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఒక ప్లాన్ కూడా స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు కూడా తాజాగా ఎవరైనా అధికార పార్టీకి చెందిన వారు డబ్బులు మద్యం పంచుతున్నారూ అని  తెలిస్తే వెంటనే వీడియో తీసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయాలి అంటూ ఒక ఫోను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తాడిపత్రి దగ్గర చీరల పంపిణీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ గా  ఉన్న ఏరియా లో బీజేపీ లీడర్ నామినేషన్స్ వేయకుండా చించేయడం..  మరొకటి మంత్రి అంజాద్ భాష  వాలెంటర్ లతో మీటింగ్ పెట్టడం.. ఇక వీటికి సంబంధించిన విజువల్స్ తెలుగుదేశం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ కి రావడం.. వీటిని టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ముందు చూపెట్టడం.. దీంతో ఒక్కసారిగా ఆంధ్ర రాజకీయాలు వేడెక్కడం జరిగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: