గుంటూరు జిల్లా గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో స్థానిక ఎన్నిక‌ల స‌మ‌రం తీవ్ర‌మైన గుబులు రేపుతోంది. ప్ర‌ధానంగా రెండు విష‌యాలు ఇక్క‌డ వైసీపీని తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. ఇక్క‌డ గ‌త ఎన్నిక ల్లో వైసీపీ క‌లిసిక‌ట్టుగా టీడీపీని ఎదుర్కొంది. ఈ క్ర‌మంలోనే బల‌మైన నాయ‌కుడిగా ఉన్న య‌ర‌ప‌తినేనిని వైసీపీ నాయ‌కుడు కాసు మ‌హేష్‌రెడ్డి ఓడించారు. ఈ నేప‌థ్యంలో కాసుకు అంద‌రూ క‌లిసివ‌చ్చారు. పార్టీలోని చిన్నా పెద్దా అంద‌రూ కూడా ఆయ‌న‌ను గెలిపించుకునేందుకు కృషి చేశారు. అయితే, కాసు గెలిచిన త‌ర్వాత పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పెరిగిపోయాయి.


ఇక్క‌డ నుంచి టికెట్ త్యాగం చేసిన జంగా కృష్ణామూర్తికి, కాసుకు మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెరిగిపోయింది. దీం తో ఇరువురు గ‌త కొన్నాళ్లుగా రెండు వ‌ర్గాలుగా చీలి పోయారు. ఇది ఒక‌వైపు వైసీపీని ఇబ్బంది పెడుతోంది. మ‌రోప‌క్క‌, రాజ‌ధాని విష‌యంలో త‌మ‌కు క్లారిటీ ఇవ్వాల‌నేది ఇక్క‌డి ప్ర‌జ‌ల డిమాండ్‌. అయితే, ఇప్ప‌టి వ‌రకు వైసీపీ త‌ర‌ఫున కాసు కానీ, జంగా కానీ ఇక్క‌డ ప‌ర్య‌టించింది లేదు. ఈ క్ర‌మంలో ఈ రెండు స‌మ‌స్య‌లు కూ డా పార్టీని వేధిస్తున్నాయి. అంద‌రినీ క‌లుపుకొని వెళ్ల‌డంతోపాటు స్థానిక సమ‌రంలో పార్టీని ఒడ్డుకు చేర్చాల్సి న బాధ్య‌త‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌పైనే పెట్టారు.


ఈ క్ర‌మంలో కాసు మ‌హేష్‌రెడ్డిపైనే ఇప్పుడు గుర‌జాల (కొన్ని మండ‌లాల‌ను విలీనం కోసం ప‌క్క‌న పెట్టా రు) మండ‌లాల్లో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాల్సిన బాధ్య‌త ఉంది. అయితే, ఈక్ర‌మంలో మంచి ప‌ట్టు న్న జంగాను ఆయ‌న క‌లుపుకొని పోతారా?  లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. నామినే టెడ్ ప‌ద‌వుల విష‌యంలో జంగా సిఫార‌సును ప‌క్క‌న పెట్టిన కాసుపై జంగా వ‌ర్గం ఆగ్ర‌హంతో ఉంది.


టికెట్ త్యాగం చేశార‌న్న కృత‌జ్ఞ‌త కూడా కాసుకు లేద‌ని జంగా వ‌ర్గం ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏం జ‌రుగుతుంది.? ఇరు వ‌ర్గాలు ఒకే తాటిపైకి వ‌స్తాయా?  రావా?  రాజ‌ధాని ప‌రిణామాలను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో ఏమేర‌కు స‌క్సెస్ అవుతారు? అనేది చూడాలి. మొత్తానికి కాసు మ‌హేష్‌కు ఇప్పుడు దిన‌దిన‌గండ‌మేన‌ని అంటున్నారు.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: