చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది.  ఎక్కడ చూసినా కరోనా టాపిక్ నడుస్తుంది.  ప్రజలు కరోనా పేరు చెబితే గజ్జున వణికిపోతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో చైనాలో 3 వేలకు పైగా మరణాలు సంబవించాయి. ప్రస్తుతం అక్కడ మరణాల సంఖ్య తగ్గినా.. కరోనా బాధితులు మాత్రం బాగా పెరిగిపోతున్నారు.  ఇక కరోనా వల్ల ఇరాన్ లో కూడా భారీగానే మరణాలు సంబవిస్తున్నాయి.  తాజాగా కరోనా మహమ్మారికి అమెరికాలో వెయ్యి మంది కి పైగా బాధితుల కేసు నమోదైనట్టు సమాచారం. ఇక ఇప్పటికే 31 మంది మరణించారట. వీరిలో 24 మంది వాషింగ్టన్ నగరంలోనే చనిపోయారు.

 

అమెరికాలో జనవరి 21న తొలి కరోనా కేసు నమోదైంది. అప్పటినుంచి కొన్ని వారాల వ్యవధిలోనే కరోనా విస్తృతమైంది. వైద్య శాస్త్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. ఇప్పటివరకు దీనికి యాంటీడోస్ కనిపెట్టలేక పోయారు.  అయితే ప్రపంచ దేశాల్లో కరోనా రోజు రోజు కీ విస్తరించడంతో ఆర్థిక రంగం కూడా కుదేలవుతుంది.  ఈ నెల మొదటివారంలో 70గా ఉన్న కేసుల సంఖ్య, కొన్నిరోజుల వ్యవధిలోనే 1000కి చేరడం ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో అర్థం అవుతుంది. ఇక భారత్ లో కూడా కరోనా బీభత్సం సృష్టిస్తుంది. 

 

కేరళాలో దీని తీవ్రత విపరీతంగా ఉందని అంటున్నారు.  భారత దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కరోనా ఎఫెక్ట్ పడిందని అంటున్నారు.  అయితె తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనాపై అవగాహన ఏర్పాటు ముమ్మురం చేస్తున్నారు.  కరోనా భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సెలబ్రెటీలు సైతం హెచ్చరిస్తున్నారు.  ఇదిలా ఉంటే.. ఇప్పుడు కరోనా ప్రభావం అధ్యక్ష ఎన్నికలపైనా పడింది. అభ్యర్థులు తమ సభలను వాయిదా వేసుకోకతప్పలేదు. సాధారణ జనజీవనం కూడా మందగించింది. షాపింగ్ మాల్స్ మూసేశారు. కళాశాలల్లో క్లాసులు రద్దు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: