మాజీ మంత్రి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఆంధ్ర రాజకీయాలలో పెద్ద సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లోనే  రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉండడం ఎన్నో అనుమానాలకు కూడా తావిచ్చింది. ఇక దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతూ వస్తోంది. ఇక ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. ఇక దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలువురు పిటిషన్ కూడా వేశారు. 

 


 తాజాగా ఏపీ హైకోర్టు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కీలక తీర్పు వెలువరించింది . మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి గత ఏడాది మార్చి 14వ తేదీన హత్యకు గురయ్యాడు. తన గదిలోనే వివేకానంద రెడ్డి ని అతి దారుణంగా హత్య చేశారు. అప్పట్లో వివేకానంద రెడ్డి హత్య ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో వివేకానంద రెడ్డి హత్య జరగడంతో... దీనిపై అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్  ను ఏర్పాటు చేసింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత మరోసారి జగన్ సర్కార్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు  మరో సిట్ ఏర్పాటు చేసింది.జగన్ సర్కారు ఏర్పాటు చేసిన సిట్  వివేకానంద రెడ్డి హత్య పై విచారణ చేస్తోంది. 

 


 ఇక వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ సర్కార్ ఏర్పాటుచేసిన సిట్ విచారణ తుది దశలో ఉంది. ఇక మరోవైపు  వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ... వివేకానంద రెడ్డి కూతురు సునీత సహా  వివేకానంద రెడ్డి భార్య టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై చాలా రోజులుగా ఏపీ హైకోర్టులో వాదనలు జరుగుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఈ పిటిషన్లపై వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పాటుచేసిన సిట్ విచారణ తుది  దశలో ఉందని ఈ నేపథ్యంలో... ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాల్సిన  అవసరం లేదు అంటూ ప్రభుత్వం తరపున అడిషనల్ జనరల్ హైకోర్టులో వాదించగా... అటు పిటిషనర్ల వాదనలు ఇటు ప్రభుత్వం తరపు ఏజీ  వాదనలు విన్న హైకోర్టు.. కేసును సీబీఐ విచారణకు అప్పగించాలి అంటూ  ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: