గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలపై వైసీపీ వర్గీయుల  దాడి ఒక్కసారిగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికలకు గాను టిడిపి నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని...నామినేషన్  పత్రాలు చించేస్తున్నారని... దాడులకు  పాల్పడుతున్నారని తెలిసి టిడిపి నేతలు బోండా ఉమ, బుద్ధా  వెంకన్న లు టిడిపి శ్రేణులను  పరామర్శించేందుకు వెళ్లగా సమాచారం అందుకున్న వైసిపి వర్గీయులు  కర్రలతో అతిదారుణంగా బోండా ఉమ,  బుద్ధా వెంకన్న పై దాడికి దిగారు. అయితే కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు కార్ లో ఉన్న అడ్వాకెట్  తల కూడా పగులగొట్టారు. ఈ ఘటన మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అంతలో  కారు డ్రైవర్  అప్రమత్తం కావడంతో టిడిపి నేతలు ప్రాణాలతో బయటపడ గలిగారు. 

 


 అయితే తాజాగా దీనిపై టీడీపీ  కీలక నేత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పందిస్తూ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయనివ్వపోతే ఇక ఎన్నికలను నిర్వహించడం ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. ఇదా స్థానిక రాజకీయం అంటూ అచ్చన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రత్యర్థులకు పోటీ చేసే అవకాశం ఇవ్వనప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకు అంటూ సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ ను ప్రశ్నించారు టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నియంతలా వ్యవహరించటం ఎంత వరకు  సమంజసం అని   ప్రశ్నించారు టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. 

 


 ప్రత్యర్థులు పోటీ చేయడానికి అవకాశం కల్పించినప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకు... అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలు ఎన్నికల నామినేషన్లు వేయకుండా... నామినేషన్ పత్రాలను చించివేయడం... టిడిపి నేతల పై దాడికి పాల్పడడం అప్రజాస్వామికం అంటూ మండిపడ్డారు. ప్రత్యర్థులు పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో పోటీ ఉన్నప్పుడు కదా వాటిని ఎన్నికల అంటారు. పోటీ చేయకుండా ఉంటే వాటిని ఇలా ఎన్నికలు అంటారు అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: