ప్రపంచంలో నెలకొన్న ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజలంతా ఒకరిమీద ఒకరికి నమ్మకం లేకుండా బ్రతుకుతున్నారు.. ఎందువల్ల అంటే పదిమందిలో నిలబడినప్పుడు దగ్గు గాని, తుమ్ములు గాని వచ్చాయంటే ఒక దొంగను కూడా అంత హీనంగా చూడరేమో కానీ ఇలాంటి వారిని మాత్రం అంతకంటే దారుణంగా చూస్తున్నారు.. ఏదో పొరబాటుగా దగ్గు, తుమ్ము వచ్చిన గానీ కరోనా వైరస్ మనముందుకు వచ్చి నిలబడింది అనే అనుమానపు చూపులు ప్రతి కళ్లల్లో కనిపిస్తున్నాయి.. ఇలాంటి పరిస్దితుల్లో బయటకు వెళ్లాలన్న భయంగా అనిపిస్తుంది..

 

 

ఇక ప్రయాణాలు చేసే సమయంలో అయితే పరిస్దితులు మరీ ఘోరంగా ఉన్నాయి.. అందులో విమానంలో ప్రయాణం చేసే వారి గురించి తలుచుకుంటేనే వణుకు వస్తుంది.. ఎందుకంటే ఒకప్పుడు విమాన ప్రయాణికుల పట్ల సిబ్బంది చూపించే వినయవిధేయతలు ఒక రేంజ్‌లో ఉండేవి కానీ ప్రస్తుత పరిస్దితుల్లో ఎంతలా దిగజారాయో ఇక్కడ కనిపించే వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది..

 

 

ఇక కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలోని అన్ని విమానాశ్రయాల్లో గానీ, విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటం వల్ల ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీంతో ఓపిక నశించిన ఓ మహిళ ప్రయాణికురాలు దగ్గు రాకపోయినా విమాన సిబ్బంది మీద దగ్గింది. అంతే అణుబాంబు పేలినట్లుగా ఉలిక్కిపడిన సిబ్బందిలోనుండి ఓ ఫ్లైట్ అటెండర్ వెంటనే మహిళను వెనక్కి వంచి ఆమె గట్టిగా పట్టుకున్న అనంతరం వైద్య సిబ్బందికి అప్పగించారు.

 

 

అసలే ప్రజలంతా కరోనాతో సతమతం అవుతుంటే ఈ మహిళ విమానంలో దగ్గి సమస్యలను కొనితెచ్చుకుని, చివరికి ఆ విమానం నుంచి దిగిపోవల్సి వచ్చింది. ఇకపోతే ఈ ఘటన షాంగై విమానాశ్రయంలోని థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. ఏది ఏమైనా ప్రయాణికులపట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని ఆ ప్రయాణికురాలు ఊహించక పోవడం వల్లే ఇన్ని తిప్పలు.. మరి కరోనా అంటే ఏమను కుంటున్నారు.. నవ్వులాటకు కూడా ఎవరు ఇలా చేయకండి.. ఇక ఈ ఘటన అంతా వీడియో తీసిన తోటి ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్త వైరల్‌గా మారింది... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: