ఈ మధ్య కాలంలో 60 ఏళ్ల వయస్సు దాటిన తరువాత బాధ్యతలన్నీ ఇతరులకు అప్పగించి విశ్రాంతి తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతుంది. కానీ ఆ బామ్మ మాత్రం తొమ్మిది పదుల వయస్సుకు చేరువవుతున్నా జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ వేసి అందరినీ అబ్బురపరిచారు. కడప జడ్పీ కార్యాలయంలో నిన్న గాలివీడు మండల జడ్పీటీసీ స్థానానికి 87 ఏళ్ల వయస్సు గల భానుబీ నామినేషన్ దాఖలు చేశారు. 
 
జడ్పీటీసీ ఎన్నికల బరిలోకి వైసీపీ తరపున బామ్మ బరిలోకి దిగడంతో అభర్థులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం గాలివీడు వైసీపీ మండల నాయకుడిగా ఖాదర్ మొహిద్ధీన్ ఉన్నారు. చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి కొన్నిరోజుల క్రితం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన కుటుంబానికి జడ్పీటీసీ టికెట్ కేటాయించారు. ప్రభుత్వం గాలివీడు జడ్పీటీసీ స్థానాన్ని మహిళలకు కేటాయించింది. ఆ కుటుంబంలో అర్హత గల ఇతర మహిళలెవరూ లేకపోవడంతో భానుబీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 
 
ఆమె కుమారుడు ఖాదర్ తన కుటుంబంలో ఉన్న ఇతర మహిళలకు అర్హతలు లేకపోవడం వల్లే భానుబీను ఎన్నికల్లో నిలిపినట్లు ప్రకటన చేశారు. భానుబీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. పదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానానికి ఆమె పోటీ చేశారు. కానీ ప్రత్యర్థి చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. 
 
87 సంవత్సరాల వయస్సులో భానుబీ నామినేషన్ దాఖలు చేసేందుకు రావడంతో జడ్పీ కార్యాలయంలోని మిగతా అభ్యర్థులంతా ఆశ్చర్యపోయారు. కడపలో వైసీపీ తరపున పోటీ చేస్తూ ఉండటంతో భానుబీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని గాలివీడు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భానుబీ ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం కడపలో అరుదైన రికార్డు భానుబీ సొంతమవుతుంది. 87 ఏళ్ల వయస్సులో పోటీ చేయడమే రికార్డు కాగా ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం మరో రికార్డు నమోదవుతుంది. భానూబీ ఈ వయస్సులో పోటీ చేస్తూ ఉండటంపై నెటిజన్లు బామ్మను ప్రశంసిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: