చాలా మంది త్ల‌లిదండ్రులు పిల్ల‌ల‌ను ప‌డుకోబెట్ట‌డం చాలా క‌ష్టంగా భావిస్తుంటారు. అందులోనూ ఐదు నుంచి ఆరు నెల‌ల పిల‌ల్ల‌ను ప‌డుకోబెట్ట‌డం చాలా క‌ష్టం. మొద‌టి మూడు నెల‌లు పిల్లలు చాలా తేలిక‌గా ఆక‌లేసిన‌ప్పుడు మాత్ర‌మే మెల‌కువ‌గా ఉండి ఎక్కువ స‌మ‌యం నిద్ర‌కే కేటాయిస్తారు. కానీ ఐదు నెల‌లు వ‌చ్చాక ఉంట‌ది అస‌లు మ‌జా అంతా వాళ్ళు స‌రిగా ప‌డుకోరు త‌ల్లిని ఇంట్లో ప‌ని స‌రిగా చేసుకోనివ్వ‌రు. ఎప్పుడూ వాళ్ళ క‌ళ్ళ‌కు క‌నిపిస్తూ ఏదో ఒక‌టి మాట‌లు చెపుతూ వెంటే ఉండాల్సి ఉంటుంది. మ‌రికొంత మంది అయితే వాళ్ళ‌ని ఎంత సేపు ఎత్తుకుని..బాగా ఎత్తుకోవ‌డం అల‌వాటు చేసేస్తారు. దాంతో వాళ్ళు కింద పెడితే చాలు ఏడుస్తారు ఎత్తుకోమ‌ని మ‌రి అలాంటి సంద‌ర్భాల్లో చాలా ఇబ్బందిని ఫేస్ చేయాల్సి వ‌స్తుంది.

 

పిల్ల‌ల‌కు నిద్ర వ‌స్తుందా లేదా అన్న‌ది ముందుగా మ‌నం గ‌మ‌నించాలి. అది ఎలాగంటే నిద్ర వ‌చ్చేముందు పిల్ల‌లు కొన్ని సంకేతాలు ఇస్తారు. అవి ఎలాంటివంటే కొంత మంది పిల్ల‌లు నిద్ర రాగానే క‌ళ్ళు న‌లుపుతారు. మ‌రికొంత మంది చేతుల‌తో చెవుల‌ను బాగా రుద్దుతుంటారు. ఆ చెవు బాగా రెడ్‌గా అయిపోయేలా చేస్తారు. ఇంకొంత మంది పిల్ల‌లు వాళ్ళ చిట్టి చిట్టి చేత‌ల‌తో చెవు పక్క‌న ఉన్న జుట్టును అంటే వాళ్ళ జుట్టును వాళ్ళే లాగేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. మ‌రి ఇలాంటి సంకేతాలు ఇచ్చిన‌ప్పుడు పిల్ల‌ల‌ను వెంట‌నే నిద్ర‌పుచ్చ‌డానికి చూడాలి. అలాగే పిల్ల‌లు ప‌డుకునే ముందు ఎక్కువ సేపు ప‌డుకోవాలంటే ముందు వారి క‌డుపు నిండుగా ఉందో లేదో చూడాలి. వారికి క‌డుపు నిండుగా పాలు తాగించ‌డం లేదా వారు ఏమి తింటే అది పెట్టి ప‌డుకోబెడితే చ‌క్క‌గా నిద్ర‌లోకి వెళ‌తారు. అలాగే చాలా మంది పిల్ల‌ల‌ను ప‌డుకోబెట్ట‌డానికి వారి భుజాల‌పైన వేసుకుని తిరుగుతూ జోకొడుతూ ప‌డుకోబెడ‌తారు. అలా చేయ‌డం వ‌ల్ల అదే అల‌వాటు అయిపోతుంది. ఎప్పుడూ అలా చేస్తేనే ప‌డుకుంటారు. ముఖ్యంగా ఇలాంటి అల‌వాట్లు అస్స‌లు చేయ‌కూడ‌దు. 

 

అలాగే మ‌రి కొంత మంది పిల్ల‌లు ఉయ్యాల‌లో వేసి ఊపి ఊపి మ‌న చేతులు నొప్పి రావాలిగాని వాళ్ళు మాత్రం పడుకోరు. ఇంకొంత మంది త‌ల్లిదండ్రులు ఏమి చేస్తారంటే వారిని గుండెల మీద వేసుకుని జోకొడుతూ ప‌డుకోబెడ‌తారు. అలా మీద ప‌డుకోబెట్టుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోని వేడి వారికి వెళుతుంది. అంతేకాక అదే అల‌వాటు అవ్వ‌డం వ‌ల్ల ఎంత పెద్ద‌గా అయినా వారు అలా ప‌డుకోవ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. దాని వ‌ల్ల పెద్ద‌వాళ్ళ‌కు కూడా కాస్త ఇబ్బంది క‌లుగుతుంది. ఎందుకంటే పిల్ల‌లు ఎప్పుడూ ఒకే వెయిట్‌లో ఒకే సైజ్‌లో ఉండ‌రు కాబ‌ట్టి. ఎప్పుడూ పిల్ల‌లు చ‌క్క‌కా నిద్ర‌పోవాలంటే ముందు గ‌ది మొత్తం డార్క్ చెయ్యాలి. ఎక్క‌డో చిన్న లైట్ త‌ప్ప ఎక్కువ వెలుతురు క‌నిపించ‌కూడ‌దు. ఆ త‌ర్వాత వారిని ప‌క్క‌న ప‌డుకోబెట్టుకుని నెమ్మ‌దిగా వారి త‌ల‌నిమురుతూ జోకొడుతూ నిద్ర‌పుచ్చాలి. ఇది అన్నిటికంటే చాలా సులువైన చిట్కా ఇలా చేయ‌డం పిల్ల‌ల‌కు, త‌ల్లిదండ్రుల‌కు ఇద్ద‌రికీ చాలా మంచిది. ఎక్కువ వెలుతురు ఉన్నా చాలా మంది పిల్ల‌లు ప‌డుకోరు. అలాగే ఎక్కువ శ‌బ్దం చేసినా ప‌డుకోరు. అవ‌న్నీ జాగ్ర‌త్త‌గా చూసుకుంటూ ప‌డుకోబెట్టుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: