ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే మాత్ర౦ అంతిమంగా పార్టీ ఇబ్బంది పడుతుంది. రాజకీయంగా టీడీపీకి అవకాశాలు ఇప్పుడు తక్కువ. బలపడటానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే జగన్ వ్యూహాలు ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల ద్వారా జగన్ ప్రజల్లోకి బలంగా వెళ్ళారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే కీలకమవుతుంది. దీనితో టీడీపీకి విజయం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది అనే చెప్పవచ్చు. 

 

ఇక రాయలసీమలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న జిల్లాల్లో అనంతపురం ఒకటి. పార్టీకి ఒకప్పుడు జిల్లా పెద్ద దిక్కుగా ఉండేది సీమలో. కాని గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. ఒకప్పుడు 12 స్థానాలు కైవసం చేసుకున్న ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జేసి దివాకర్ రెడ్డి వర్గం విషయానికి వస్తే ఆయన నుంచి ఆశించిన స్థాయిలో పార్టీకి సహకారం లేదని అంటున్నారు. ఆయన వర్గం పెద్దగా ముందుకి రావడం లేదు అనే భావన పార్టీ నేతల్లో ఉంది. 

 

ఆయనతో ఇప్పటికే పార్టీ అగ్ర నేతలు మాట్లాడినా సరే ఫలితం లేదని ఆయన ఎంత మాత్రం పార్టీ కోసం పని చేయడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జేసి వర్గాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తుంది. ఈ తరుణంలో మళ్ళీ పోటి చేస్తే ఇంకా ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనే భావన జేసి వర్గంలో వ్యక్తమవుతుంది. అందుకే ఆయన పార్టీకి దూరంగా ఉన్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే జిల్లాలో ఇప్పుడు జేసి వర్గం సహకరించకపోవడం, ఆయన వర్గం కూడా పోటీ చేయకుండా దూరంగా ఉండటం జిల్లాలో చర్చనీయంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: