తెలంగాణ రాష్ట్రం నుండి టిఆర్ఎస్ పార్టీ తరఫున రెండు రాజ్యసభ స్థానాలను కెసిఆర్ ఖరారు చేయడం జరిగింది. కేకే కు మరియు పొంగులేటి సుధాకర్ రెడ్డి కి ఆ రెండు స్థానాలు కేటాయించడంతో తెలంగాణ రాజకీయాలలో రాజ్యసభ ఆశావహుల నోర్లు మరియు ఆశలు ఆవిరైపోయాయి. ఈ రెండు స్థానాలు కోసం తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది పేర్లు వినబడ్డాయి. కెసిఆర్ కూతురు కవిత మరియు నమస్తే తెలంగాణ ఎండీ దామోదరరావు, హెటిరో గ్రూప్ అధినేత పార్థసారథిరెడ్డి, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, మందా జగన్నాథం, పార్టీ నేత గ్యాదరి బాలమల్లు పేర్లు వచ్చాయి. కానీ చివరాకరికి కేకే కి మరియు పొంగులేటి సుధాకర్ రెడ్డి కి రాజ్యసభ స్థానాలు కెసిఆర్ కేటాయించడం జరిగింది.

 

అయితే కేశవరావు ఈ విషయములో ఎప్పటినుండో అందరూ అనుకున్నట్టే స్థానం వచ్చినా గానీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కి కెసిఆర్ రాజ్యసభ కేటాయించటం పట్ల అతి పెద్ద స్కెచ్, ప్లాన్ ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళితే వైసీపీ అధినేత జగన్ ఆశీస్సుల మేరకు పొంగులేటి సుధాకర్ రెడ్డి కి రాజ్యసభ స్థానం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే జాతీయ రాజకీయాలను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల చేత ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుండి రావలసిన మేలు విషయంలో కలసి పోరాడాలని డిసైడ్ అయ్యారట.

 

దీంతో రాష్ట్రాల పరంగా ఎన్ని గొడవలు ఉన్నాయి కానీ కేంద్ర పరంగా ఎక్కడ విడిపోకూడదు అన్నా ఒప్పందము తో ఇద్దరికిద్దరూ అనగా జగన్ మరియు కేసీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే విధంగా కలసి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందువల్లనే కెసిఆర్... పొంగులేటి సుధాకర్ రెడ్డి నీ రాజ్యసభకు పంపినట్లు టాక్. మరోపక్క జగన్ కూడా తన పార్టీకి సంబంధించిన నాలుగు రాజ్యసభ సభ్యుల విషయంలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: