ఏపీ ముఖ్య‌త్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన రిట‌ర్న్ గిఫ్ట్ ఇప్పుడు రాజ‌కీయ‌వర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారుతోంది. ఏ అంశం ఆధారంగా అయితే టీడీపీ అధ్య‌క్షుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు త‌న‌ను టార్గెట్ చేశారో అదే అంశం ఆధారంగా జ‌గ‌న్ ఇప్పుడు బాబుకు షాక్ ఇచ్చార‌ని అంటున్నారు. జంప్ జిలానీల‌ను ప్రోత్స‌హించ‌డం, పార్టీలో ఉన్న నేత‌ల‌ను ప‌ట్టించుకోకుండా బాబు ఆడిన ఆట ఆయ‌న‌కే ఇప్పుడు షాకిచ్చింది. ఇదంతా క‌డ‌ప జిల్లా నేత ఆదినారాయ‌ణ రెడ్డి చేరిక గురించి.

 

2014 ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలో తీసుకోవడంతో పాటు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జ‌గ‌న్‌ను చంద్ర‌బాబు టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో జమ్మలమడుగు టీడీపీ సీనియ‌ర్‌ నేత రామసుబ్బారెడ్డిని టీడీపీ అధినేత‌ చంద్రబాబునాయుడు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో గవర్నర్‌ కోటాలో టికెట్‌ ఇస్తానని రామసుబ్బారెడ్డికి సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని నిల‌బెట్టుకోవ‌డంలో బాబు జాప్యం చేస్తున్నార‌ని రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గీయులు ఒక ద‌శ‌లో మండిప‌డ్డారు. మహానాడు సమయంలో రామసుబ్బారెడ్డి టీడీపీ కార్యకర్తలతో సమావేశమం ఇందుకు నిద‌ర్శ‌నం. 

 

అయితే,  జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి- రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న‌ప్ప‌టికీ... దశాబ్దాల నుంచి ఆ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్‌ గొడవలు ఉన్నా కూడా  అటువంటి వారి మధ్య సయోధ్య కుదర్చడంలో చంద్రబాబు స‌ఫలీకృతులు కాలేదు. దీంతో రామ‌సుబ్బారెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు. ఇక ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డం, ఆ పార్టీకి భ‌విష్య‌త్ క‌నిపించ‌ని ప‌రిస్థితుల్లో రామ‌సుబ్బారెడ్డి చూపు వైసీపీపై ప‌డింది. దీంతో జ‌గ‌న్ చేరిక‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అయితే త‌న‌ను బాబు టార్గెట్ చేశారో అక్క‌డే ఆ పార్టీని ఖాళీ చేసేశారు. త‌ద్వారా త‌న రిట‌ర్న్ గిప్ట్ స‌త్తా చూపించారు సీఎం జ‌గ‌న్‌. జ‌గ‌న్ నిర్ణ‌యంతో బాబు మైండ్ బ్లాంక‌యిన ప‌రిస్థితి అని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: