దిన పత్రిక సాధారణంగా ఏం చేస్తుంది.. ఇదేం పిచ్చి ప్రశ్న.. పేపర్ ఏం చేస్తుంది. వార్తలు ఇస్తుంది.. అదేంటి వార్తలు మాత్రమే ఇస్తుందా.. వివిధ రంగాల్లోని సంఘటనలు - వాటి ప్రభావాన్ని పాఠకులకు అందిస్తుంది.. ... ఇంకా ఏంచేస్తుంది... .. ప్రకటనలు కూడా ఇస్తుంది. సాధారణంగా పత్రిక గురించిన సమాచారం ఇదే. కానీ ఇటీవల పత్రికలతో పాటు ప్రకటన పాంప్లేట్లు కూడా వస్తుంటాయనుకోండి..

 

 

ఒక్కోసారి పత్రికలతో పాటు ఓ షాంపూ పాకెట్లో... ఫ్రీ కూపనో కూడా అందుతుంటాయి. ఏదైనా కొత్త సంస్థ మార్కెట్లోకి వచ్చినప్పుడు వారి ప్రోడక్ట్స్ ను ఫ్రీగా పత్రికల ద్వారా అందిస్తుంటాయి. ఇది కూడా పాఠకులకు అనుభవమే.. అంతే కాదు... కొన్ని పత్రికలు సీజన్ల వారీగా సేవలు అందిస్తాయి. ఉదాహరణకు ఇది పరీక్షల సమయం కదా.. కొన్ని పత్రికలు విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ ను పాఠకులకు అందిస్తాయి. మరికొన్ని పత్రికలు.. ఉద్యోగార్థుల కోసం ప్రత్యేక పేజీలు కేటాయిస్తుంటాయి.

 

 

ఇదంతా మన ఇండియన్ పత్రిక ఒరవడి.. కానీ ఓ ఆస్ట్రేలియన్ పత్రిక మాత్రం.. ఇటీవల ఓ సంచలనం సృష్టించింది. ఓ ఎనిమిది పేజీల బ్లాంక్ పేపర్ ను పత్రికతో పాటు అందించింది. అంటే పూర్తిగా ఖాళీ పేజీలన్నమాట.. అవి ఎందుకూ అంటారా.. ఆస్ట్రేలియాలోని ఎన్టీ న్యూస్ అనే పత్రిక... ఈ కాగితాన్ని టాయిలెట్ పేపర్‌గా వాడుకొండి, ఆ అవసరం కోసమే ప్రత్యేకంగా ఇలా ముద్రించాం అని ప్రకటించింది.

 

 

దీనిపై ఆ పత్రిక ఎడిటర్ మాట్ విలియమ్స్ వివరణ ఏంటంటే.. ఇందులో ఆశ్చర్యపడిపోవటానికి ఏమీలేదు.. ప్రజల అవసరాలు గుర్తించడంలో, సాయం చేయడంలో మేమెప్పుడూ సిద్ధమే, ఇప్పుడు ఆస్ట్రేలియాలోని ఒక ప్రాంత ప్రజలు టాయిలెట్ పేపర్ దొరక్క ఇబ్బందిపడుతున్నారు.. అందుకని ఆ అవసరాన్ని తీర్చటానికి మేమిలా ప్రయత్నించాం అని చెప్పాడు. భలే విచిత్రంగా ఉంది కదా.. మన ఏపీలోనూ రాజకీయ నాయకులు కొన్ని పత్రికలు తిడుతుంటారు కదా.. అవి టాయిలెట్ పేపర్లుగా కూడా పనికిరావని.. ఆ ఆస్ట్రేలియన్ పత్రిక అలాగే చేసింది మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: