ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల సందడి స్టార్ట్ అయింది. అధికారంలో ఉన్న వైసిపి పార్టీ కచ్చితంగా నాలుగు స్థానాలను కైవసం చేసుకునే సంఖ్యా బలం ఉంది. మూడు గ్యారెంటీ కానీ నాలుగోది కొద్దిగా అటు ఇటు కాని పరిస్థితిలో ఉంది. ఇటువంటి టైములో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎటువంటి సంఖ్యాబలం లేకపోయినా గాని రాజ్యసభ రేసులో వర్ల రామయ్య ని పోటీకి దింపడం జరిగింది. సంఖ్యా బలం బట్టి చూసుకుంటే చంద్రబాబుకి గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవు. అయినా గాని చంద్రబాబు సీనియర్ నేత వర్ల రామయ్య ఎన్నికల బరిలో పోటీకి దింపడం పట్ల అనేక చర్చలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నాయి.

 

ఇటీవల ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంఖ్యాబలం లేకపోయినా గాని సరే రాజ్యసభ బరిలో అభ్యర్థి నిలుపుతున్నామని అన్నారు. అలాగే… వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్నారు. దానికి అర్ధం ఏంటో తెలియకపోయినా టీడీపీ నేతలు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ మీద ఆగ్రహంగా ఉన్నారు. దీనితో వారికి చంద్రబాబు గాలం వేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

 

మూడు రాజధానుల విషయంలో ఎవరికీ చెప్పకుండా జగన్ తన ఇష్టానుసారంగా నిర్ణయం ప్రకటించడంతో...రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అనేక దాడులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలో ఉన్న అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలకు ఎరవేసి ఒక రాజ్యసభ స్థానాన్ని గెలిచే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క జగన్ తన పార్టీ తరఫున రాజ్యసభకు మోపిదేవి వెంకటరమణ. పిల్లి సుభాష్ చంద్రబోసు, పరిమల్ నత్వాని, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేర్లను ఖరారు చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే ఈ నలుగురు ఏకగ్రీవం అయ్యే చాన్స్ ఉన్నట్లు పరిస్థితులు కనపడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: