దేశీయ స్టాక్ మార్కెట్‌ ఆరంభంలో ఒక రేంజ్ లో దూసుకెళ్లింది. కానీ చివరికి బెంచ్‌మార్క్ సూచీలు ప్రారంభంలో లాభాలతో దూసుకెళ్లినా కూడా చివరకు వచ్చేసరికి స్వల్ప లాభాలు( ప్లాట్) గానే ముగిసింది. బుధవారం నాడు బెంచ్‌ మార్క్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయినాయి. ముఖ్యంగా సెన్సెక్స్ ఇంట్రాడేలో 760 పాయింట్ల శ్రేణిలో ఉగిసలాడింది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 10,545 పాయింట్ల గరిష్ట స్థాయిని అందుకొని ఒక దశలో 10,334 పాయింట్ల కనిష్ట స్థాయిని కూడా తాకింది. చివరకి వచ్చేసరికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 62 పాయింట్ల స్వల్ప లాభంతో 35,697 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ కేవలం 7 స్వల్ప పాయింట్ల లాభంతో 10,458 వద్ద ముగిశాయి.

 

 

 

ఇందులో ముఖ్యంగా  ప్రైవేట్ బ్యాంక్ రంగ షేర్లు, నిఫ్టీ మీడియా, ఫైనాన్షియల్ లాభపడ్డాయి. కాకపోతే ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు మాత్రం ఎక్కువగా నష్టపోయాయి. అలాగే  నిఫ్టీ - 50లో యస్ బ్యాంక్,  కోల్ ఇండియా, హీరో మోటొకార్ప్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, భారతీ ఇన్‌ ఫ్రాటెల్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. యస్ బ్యాంక్ తన షేర్ వ్యాల్యూ ఏకంగా 37 శాతం పరుగులు పెట్టింది.

 

 

 

అలాగే నిఫ్టీ - 50లో గెయిల్, టటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. ఇందులో ముఖ్యంగా గెయిల్ షేరు ఏకంగా పది శాతానికి పైగా నష్ట పోయింది. ఇంకా నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. అలాగే మిగితా నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు మినహా మిగతా సూచీలన్నీ నష్టాల్లోనే ముగిసాయి. ఇందులో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ దాదాపు నాలుగు శాతం వరకు నష్ట పోయింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడా రెండు శాతం నష్ట పోయింది.

 

 

 

అలాగే ఇక రూపాయ మారకపు విలువకు వస్తే అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఇండియన్ రూపాయి కాస్త లాభాల్లో ట్రేడ్ అయ్యింది. ప్రస్తుతం 42 పైసలు లాభంతో 73.66 వద్ద ఊగిసలాడుతుంది. అలాగే ఇంకో చెప్పుకోతగ్గ విషయం ఏమిటంటే అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు తగ్గాయి. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌ కు 2.58% తగ్గుదలతో 36.25 డాలర్లకు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: