ఇదిగో మేక అంటే అదిగో పులి అని అనే జనం ఉన్న ఈ లోకంలో.. ఏదైన అనుకోనిది జరిగితే జనానికి అంతా వింతే.. ఇక కరోనా అనే కొత్త రోగం వచ్చినప్పటి నుండి జనం వేసే వేషాలు చాలా వింత వింతగా ఉంటున్నాయి.. కరోనా భయంతో కొన్ని కొన్ని కంపెనీలే మూసేసారు.. మరికొందరైతే ఇంటినుండే వర్క్ చేపించు కుంటున్నారు.. మొత్తానికి చూసుకుంటే కరోనా వైరస్ ప్రభావంతో జన జీవనంలో చాలా మార్పులు సంభవించాయి..

 

 

ఇకపోతే కొన్నికంపెనీలకు ఇంటినుండి పనిచేపించుకోలేని పరిస్దితులు తలెత్తగా ఈ కరోన భారీన పడకుండా తగుచర్యలు తీసుకుంటున్నాయి.. ఇందులో సౌదీ అరేబియాలోని చమురు కంపెనీ ఆరామ్‌కో కూడా ఒకటి. ఇప్పుడు ఆ కంపెనీ చేసిన నిర్వాకం  సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజనుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది.. ఇక ఈ మధ్యకాలంలో కరోనా వైరస్, సోకకుండా ఉండాలంటే . . మీ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. లేదా హ్యాండ్ శ్యానటైజర్‌లను ఉపయోగించాలనే. ప్రచారం ఎక్కడ చూసిన వినిపిస్తుంది..

 

 

అయితే ఈ విధానాన్నే కొత్తగా అమలు చేసిన ఆరామ్‌కో కంపెనీ అభాసుపాలవుతోంది. ఈ విధానం కోసం ఆరామ్‌కో కంపెనీలో హ్యాండ్ శ్యానటైజర్ కోసం ఓ వ్యక్తిని నియమించగా, అతడు ఆఫీసులోని ఉద్యోగులకు శ్యానటైజర్ అందిస్తూ ఉండటం అతని డ్యూటీ.. ఐతే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో. నెటిజనులు కంపెనీ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు..

 

 

మరి కొందరైతే మీ తెలివి తెల్లారినట్టే ఉంది.. ఇంత దానికి అంత బిల్డప్ అవసరమా అని వెటకారం చేస్తున్నారు.. కాగా ఈ కరోనా భారిన పడిన పలుదేశాల ప్రజలు ఇప్పటికే ప్రాణాపాయ స్దితిలో కొట్టుమిట్టాడుతున్నారు.. మరికొందరు మరణించారు కూడా.. ఇక ఈ రక్తపిశాచి ఎప్పుడు తన దాహాన్ని తీర్చుకోవడం ఆపేస్తుందా అని ప్రపంచదేశాలన్ని ఆశగా చూస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: