ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం వన్‌సైడ్ వార్ జరిగేలా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీకి మెజారిటీ స్థానాలు రావడం ఖాయమని అర్ధమవుతుంది. కనీసం 70 శాతంపైగా వైసీపీ అభ్యర్ధులు గెలిచేలా ఉన్నారు. అంతా అనుకూలంగా ఉంటే 90 శాతం స్థానాలని గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే అలా వైసీపీకి వన్‌సైడ్‌గా విజయం దక్కే నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలవడం ఖాయమైపోయినట్లే కనిపిస్తోంది.

 

మామూలుగానే మాచర్ల వైసీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ నుంచి వైసీపీ తరుపున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా గెలుస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పిన్నెల్లి, 2012 ఉపఎన్నికల్లో వైసీపీ తరుపున విజయం సాధించారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుపు గుర్రం ఎక్కారు. ఇక్కడ పిన్నెల్లి దెబ్బకు టీడీపీ అభ్యర్ధులు వరుసగా ఓడిపోతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో పిన్నెల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అటు ఎలాగో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయి.

 

పైగా ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేదు. ఇటీవలే చలమారెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించిన, ఆయన పెద్దగా పిన్నెల్లికి పోటీ ఇచ్చే సత్తా లేదు. దీంతో స్థానిక సమరంలో వార్ వన్‌సైడ్ అయిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి, మాచర్ల రూరల్ మండలాల్లో వైసీపీ స్ట్రాంగ్‌గానే ఉంది. ఈ జెడ్పీటీసీ స్థానాలన్ని వైసీపీ ఖాతాలో పడిపోతాయని తెలుస్తోంది.

 

అటు నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ మాచర్లలో కూడా వైసీపీ తిరుగులేని విజయం అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే టీడీపీ కొన్ని గ్రామాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. నియోజకవర్గంలో టీడీపీకి బలం ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఆ  చోట్ల ఎంపీటీసీ స్థానాలని గెలుచుకోవచ్చు. మొత్తానికైతే మాచర్లలో వైసీపీ వన్‌సైడ్ విక్టరీ సాధించడం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: