స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా బలంగా ఉన్న అధికార పార్టీ ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయ౦ సాధించి సత్తా చాటాలని భావిస్తుంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఈ ఎన్నికల కోసం తీవ్రంగానే కష్టపడుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ నేతలు ఎన్నికల కోసం వ్యూహాలు సిద్దం చేసారు. నామినేషన్ గడువు నేటితో పూర్తి  అయింది. 

 

దీనితో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిని విజయలక్ష్మి వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు పరిటాల జేసి కుటుంబాల మధ్య మళ్ళీ విభేదాలు బయటకు వచ్చాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రంగా వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయని అంటున్నారు. కొన్ని చోట్ల పరిటాల వర్గం కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది అనే భావనలో జేసి వర్గం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఇరు వర్గాల్లో చర్చ కూడా జరిగినట్టు సమాచారం. కొన్ని కొన్ని చోట్ల పరిటాల వర్గం పెత్తనం నడుస్తుంది అని భావిస్తున్నారు. 

 

జేసి వర్గం పోటీకి దూరంగా ఉంది. కాని పరిటాల వర్గం మాత్రం వైసీపీ తో కలిసి జేసి వర్గానికి పట్టు ఉన్న గ్రామాల్లో అధికార పార్టీకి సహకరిస్తుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆరోపణలు వస్తున్నాయి. కీలక నియోజకవర్గాల్లో కూడా ఇదే విధమైన వ్యవహారశైలి పరిటాల వర్గం చూపిస్తున్నారు అనే భావన జేసి వర్గం వ్యక్తం చేస్తుంది. ఇక ఇది అటు తిరిగి ఇటు తిరిగి అధికార పార్టీకి సహకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఉన్నాయని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల గడువు నేటితో ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: