ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది.. కాని ఈ అవకాశమే అబ్బాయిలను సుఖపడేలా చేస్తుంది. అమ్మాయిలను మోసపోయేలా.. ప్రేమ పేరుతో లోకంలో ఎంతమంది అమ్మాయిలు మోసపోతున్నారో  లెక్కేలేదు.. ఇక గొర్రె కసాయివాడిని నమ్మినట్లుగా ఈ అమ్మాయిలు మోసం చేసే వారినే గుడ్డిగా నమ్ముతారు.. ఇదే అలుసుగా తీసుకున్న అబ్బాయిలు అమ్మాయిలను ప్లే గ్రౌండ్‌లో బంతిని చేసి ఆడుకుంటున్నారు.. అమ్మాయిలు కూడా ఏం తక్కువ తినలేదు.. అబ్బాయిలను ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకుని వదిలేయడంతో కొందరు సైకోగా మారి ప్రాణాలు తీసుకుంటున్నారు, తీస్తున్నారు..

 

 

ఇక ఎటొచ్చిన బాధ అమాయకమైన వారికే.. ఇలాంటి ఒక అమాయకురాలు ప్రేమ పేరుతో ఎలా మోసపోయిందో తెలుసుకుంటే.. ఇకహైదరాబాద్ లోని, బంజారాహిల్స్ లో ఉన్న ఓ బస్తీలో నివసించే పాతికేళ్ల యువకుడు.. తన ఇంటికి దగ్గర్లోనే ఉన్న 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. అతని ప్లానులో భాగంగా ఆమె ముందు రోజూ..మంచివాడిలా నటిస్తూ..కాలేజీకి వెళ్లే ఆ యువతి వెంటపడేవాడు. మొదట్లో పట్టించుకోకపోయినా ఆ అమ్మాయి ఇన్ని రోజులుగా ఓ అబ్బాయి తనవెంట పడుతుండటంతో గర్వంగా ఫీలయ్యి అతన్ని చూడటం మొదలు పెట్టింది. ఇంకేముంది దీన్ని అవకాశంగా తీసుకున్న ఆ యువకుడు ఆమెతో మాటలు కలిపి మెల్లగా ముగ్గులోకి లాగాడు.. ఈ విషయం కాస్త ఆ అమ్మాయి తండ్రికి తెలియడంతో కూతుర్ని మందలించాడు. ఓ నాలుగురోజులు దూరంగానే ఉన్నా, ఈ వయస్సు ఊరుకుంటుందా, మళ్లీ ఆ అబ్బాయితో జత కలిపింది..

 

 

ఇదే అదనుగా భావించిన ఆ కామాంధుడు తిరుమల కొండకు వెళ్లి పెళ్లి చేసేసుకుందాం అనగా. ఆ అమాయకురాలు ఒప్పుకుంది.. ఇక ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అతనితో చెక్కేసింది. అలా వెళ్ళిన ఈ జంట తిరుపతిలోని ఓ హోటల్ లో దిగారు. అయితే ఆ రాత్రే ఆమె జీవితం నాశనం అవుతుందని ఊహించలేదు.. మెల్లగా మాటలు కలిపి ఆ బాలికను అనుభవించాడు..పెళ్లికి ముందే ఇలాంటివి వద్దని ఆ యువతి మొత్తుకున్నా వినలేదు. రేపు పెళ్లి అని నమ్మబలికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాతి రోజు కూడా పెళ్లిని వాయిదా వేసి ఆ రాత్రి కూడా అత్యాచారం చేశాడు.

 

 

తర్వాతి రోజు ఆమె నిద్రలేచి చూస్తే.. అతను పక్కన లేడు. ఏమయ్యాడా అని అంతా చూసింది. ఎక్కడా లేడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఇక తాను మోసపోయానని గ్రహించిన ఆ బాధితురాలు తిరిగి బంజారాహిల్స్ వచ్చి జరిగిన దారుణ ఘటనను తండ్రికి చెప్పుకుని ఏడ్చేసింది. ఏం చేయాలో పాలుపోని ఆ తండ్రి కూతుర్ని ఓదార్చి, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసు పెట్టించాడు. యువకుడి ఫోన్ నంబర్ ఆధారంగా అతడి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: