ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన,బిజెపి, టిడిపి పార్టీలు ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని దృఢ నిశ్చయం తో ఉన్నాయి. ఇక మరోవైపు అధికార వైసిపి పార్టీ కూడా ఘన విజయం సాధిస్తామని దృడ నమ్మకంతో ఉంది. అయితే గత కొన్ని నెలల క్రితం టిడిపి పార్టీ తో జనసేన పార్టీ పొత్తు పెట్టుకునే విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి పొత్తు విడిపోయినప్పటికీ ఇద్దరూ కలిసే ముందుకు సాగుతున్నారని ఎన్నో రోజులుగా వైసీపీ విమర్శలు కూడా చేస్తోంది. ఇక మొన్నటికి మొన్న జనసేన పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఒకటిగా ముందుకు  నడుస్తున్నారు. 

 


 ఇక స్థానిక సంస్థల నేపథ్యంలో జనసేన టిడిపి పార్టీ లకు సంబంధించి కొన్ని వార్తలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారి పోయాయి. ప్రస్తుతం రెండు పత్రికల్లో వచ్చిన రెండు వార్తలు ఆంధ్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అందులో ఒకటి తెలుగుదేశం అనుకూల పత్రిక గా ముద్రపడిన ఆంధ్రజ్యోతి పత్రిక లో ఒక కథనం వచ్చింది. తాడేపల్లిగూడెం దగ్గర తెలుగుదేశం జనసేన పార్టీలో కలిసిపోయాయని.. ఈ రెండు పార్టీల మధ్య రహస్య పొత్తు ఉందని... అక్కడ జనసేన టిడిపి పార్టీ మధ్య సర్దుబాటు జరిగాయని.. అంతేకాకుండా గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి సర్దుబాట్లు జరుగుతున్నాయని.. ఇక భారతీయ జనతా పార్టీని కూడా కొన్నిచోట్ల సర్దుబాటు కావాలని  వైస్ ప్రెసిడెంట్ పదవి ఇస్తామని చెప్పారు అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం ప్రచురితమైంది.

 

 ఇక ఈ కథనం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక తాజాగా దక్కన్ క్రానికల్ లో కూడా ఇలాంటిదే ఒక చర్చనీయాంశ కథనం ప్రచురితమైంది. ప్రస్తుతం ఇది అందరిని అయోమయంలో పడేసింది. దక్కన్ క్రానికల్ లో  కాకినాడ ఈ ప్రాంతం గురించి చెప్పారు. ఎక్కడ టీడీపీ బలంగా ఉంటుందో అక్కడ జనసేన... ఎక్కడ జనసేన బలంగా ఉంటుందో  అక్కడ టిడిపి పోటీ చేయకుండా ఉండాలి అన్నటువంటి కాన్సెప్టును రెండు పార్టీలు ఫాలో అవుతున్నాయని  దక్కన్ క్రానికల్ లో  ప్రధానంగా కథనం రాశారు. అంతే కాకుండా టిడిపి బిజెపికి వ్యతిరేకంగా పోటీ చేస్తుంది కానీ ఎక్కడ జనసేన కు వ్యతిరేకంగా మాత్రం పోటీ చేయడం లేదు అన్నది ఈ కథనం సారాంశం. మరి నిజంగానే జనసేన టీడీపీ తో మరోసారి సర్దుబాటు చేసుకుందా అనే విషయాన్ని జనసేన వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇంకెప్పుడూ జనసేన ఒంటరిగా పోటీ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి మాత్రం ఉండదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: